బీటా టెస్టింగ్ దశలో HOP OXO electric motorcycle
దేశవ్యాప్తంగా 20నగరాల్లో టెస్ట్ రైడ్స్..
HOP OXO electric motorcycle : HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ (HOP Electric Mobility ) సంస్థ అధికారిక ప్రారంభానికి దాని ఎలక్ట్రిక్ బైక్ – HOP OXO ఈ-బైక్‌ను ను ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ మోటార్‌సైకిల్ బీటా టెస్టింగ్ దశలో ఉంది. HOP తన మోటార్‌సైకిల్ గురించిన ఆసక్తికరమైన వివరాలు, టెస్టింగ్ అనుభవాలను వెల్లడించింది. అలాగే, కంపెనీ R&D బృందం టెస్టింగ్ దశలో తలెత్తే లోపాలను అర్థం చేసుకోవడానికి వానిని పరిష్కరించడంపై దృష్టి పెట్టింది.బీటా టెస్టింగ్ దశలో నివేదికల ప్రకారం.. HOP OXO electric bike గరిష్టంగా 100 kmph వేగంతో దూసుకుపోతుంది. ఇందులో వినియోగించిన Li-ion బ్యాటరీ ప్యాక్ సాయంతో ఒక్కసారి ఛార్జ్‌పై దాదాపు 150 కిమీల పరిధిని అందించగలదు.
వినియోగదారులతో HOP OXO electric motorcycle టెస్ట్ రైడ్స్
HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ CEO, సహ వ్యవస్థాపకుడు కేతన్ మెహత...