Sunday, December 8Lend a hand to save the Planet
Shadow

బీటా టెస్టింగ్ దశలో HOP OXO electric motorcycle

Spread the love

దేశవ్యాప్తంగా 20న‌గ‌రాల్లో టెస్ట్ రైడ్స్‌..

HOP OXO electric motorcycle : HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ (HOP Electric Mobility ) సంస్థ అధికారిక ప్రారంభానికి దాని ఎలక్ట్రిక్ బైక్ – HOP OXO ఈ-బైక్‌ను ను ఆవిష్కరించింది. ప్రస్తుతం ఈ మోటార్‌సైకిల్ బీటా టెస్టింగ్ దశలో ఉంది. HOP తన మోటార్‌సైకిల్ గురించిన ఆసక్తికరమైన వివ‌రాలు, టెస్టింగ్ అనుభ‌వాల‌ను వెల్ల‌డించింది. అలాగే, కంపెనీ R&D బృందం టెస్టింగ్ దశలో తలెత్తే లోపాలను అర్థం చేసుకోవడానికి వానిని పరిష్కరించడంపై దృష్టి పెట్టింది.

బీటా టెస్టింగ్ దశలో నివేదికల ప్రకారం.. HOP OXO electric bike గరిష్టంగా 100 kmph వేగంతో దూసుకుపోతుంది. ఇందులో వినియోగించిన Li-ion బ్యాటరీ ప్యాక్ సాయంతో ఒక్కసారి ఛార్జ్‌పై దాదాపు 150 కిమీల పరిధిని అందించగలదు.

వినియోగ‌దారులతో HOP OXO electric motorcycle టెస్ట్ రైడ్స్‌

HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ CEO, సహ వ్యవస్థాపకుడు కేతన్ మెహతా మాట్లాడుతూ “ త‌మ ఉత్పత్తులను ల్యాబ్‌లలో ఇంజనీర్లు డిజైనర్లు అభివృద్ధి చేసినప్పటికీ, డీలర్లు, వినియోగదారుల నుండి వ‌చ్చే సంతృప్తే చాలా కీలకమైనవని తెలిపారు. వినియోగదారుల ద్వారా ట్రయల్స్‌ను ప్రారంభించిన మొదటి భారతీయ EV ప్లేయర్..  HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ అని ప్రకటించినందుకు తాము సంతోషిస్తున్నామని తెలిపారు. #OXOSNEAKPEEK ప్రోగ్రామ్‌తో తాము ఎంచుకున్న భాగస్వాముల నుంచి నేరుగా అభిప్రాయాన్ని సూచనలను పొందుతున్నామని పేర్కొన్నారు. భారతదేశం అంతటా 30,000 కి.మీ కంటే ఎక్కువ ఆన్-రోడ్ ఇంటర్నల్ టెస్టింగ్ నిర్వహిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ఈ ప‌రీక్ష‌ల ద్వారా సేకరించిన ఇన్‌పుట్‌లు ఆధునిక కస్టమర్ల అవసరాలను తీర్చేలా వాహ‌నాల‌ను తీర్చ‌దిద్దేందుకు సాయ‌ప‌డ‌తాయ‌ని తెలిపారు.

జైపూర్‌లో 1.8ల‌క్ష‌ల యూనిట్ల వార్షిక సామ‌ర్థ్యం

ప్రస్తుతానికి, జోధ్‌పూర్, జైపూర్, పాట్నా, హైదరాబాద్, లూథియానా, కోల్‌కతాతో పాటు దేశంలోని సుమారు 20 నగరాల్లో HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ.. OXO మ్యూల్స్‌పై 30,000 కిలోమీటర్లకు పైగా టెస్ట్ రైడ్లు ప్రయాణించింది. అలాగే HOP జైపూర్‌లో అత్యాధునిక HOP మెగాప్లెక్స్‌ను ప్రారంభించింది. ఏటా 1.8 లక్షల యూనిట్ల తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉండాలని కంపెనీ దృష్టి సారిస్తోంది.

మ‌రో మూడేళ్ల‌లో 10 మోడ‌ళ్లు..

ప్రస్తుతం ఈ కంపెనీ తన LEO, LYF మోడ‌ళ్ల‌ను త‌న ప‌రిశ్ర‌మ‌లో తయారు చేస్తోంది. త్వరలో ఇది ఫ్యాక్టరీ నుండి LYF2.0, అలాగే OXO తయారీ ప్రక్రియతో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం HOP మెగాప్లెక్స్ దాని చార్ట్‌లో ప్రతిరోజూ 100 electric scooters లను ఉత్పత్తి చేస్తుంది. రాబోయే మూడేళ్లలో HOP భారత మార్కెట్లో 10 కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.


మరిన్ని అప్‌డేట్‌ల కోసం హ‌రిత‌మిత్ర వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు సంబంధించిన వీడియోల కోసం మా  Haritha mithra YouTube ఛానెల్‌ను స‌బ్‌స్క్రైబ్ చేసుకోండి.!

4 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *