Sunday, December 8Lend a hand to save the Planet
Shadow

Tag: Pralhad Joshi

Renewable Energy | పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 32.5 లక్షల కోట్ల నిధులు

Renewable Energy | పునరుత్పాదక ఇంధన రంగంలో రూ. 32.5 లక్షల కోట్ల నిధులు

Solar Energy
Renewable Energy : గుజరాత్‌ రాజధాని గాంధీనగర్ లో జరిగిన పునరుత్పాదక ఇంధన సదస్సు (RE Invest 2024 ) లో పలు రాష్ట్రాలు భాగస్వాముల‌య్యాయ‌ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషీ (Pralhad Joshi) తెలిపారు. 2030 నాటికి రెన్యూవ‌బుల్ ఎన‌ర్జీ రంగంలో రూ. 32.5 లక్షల కోట్ల నిధులు సమకూర్చేందుకు బ్యాంకులు, ఆర్ధిక సంస్ధలు ముందుకొచ్చాయని పేర్కొన్నారు. సంప్ర‌దాయ‌ విద్యుత్‌ రంగాన్ని పునరుత్పాదక ఇంధన రంగంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్ర‌ణాళికా బ‌ద్దంగా ప‌నిచేస్తోంద‌ని తెలిపారు. ఈ సదస్సులో నాలుగు దేశాలు హాజరయ్యాయని వెల్ల‌డించారు. మంత్రి ప్రహ్లాద్‌ జోషీ మంగళవారం గాంధీనగర్‌లో మీడియా స‌మావేశంలో మాట్లాడారు.పునరుత్పాదక ఇంధన రంగం (Renewable Energy) లో భారత్‌ ప్రపంచానికి రోల్‌మాడ‌ల్‌గా నిల‌వ‌నుంద‌ని మంత్రి ప్రహ్లాద్‌ జోషీ ధీమా వ్య‌క్తం చేశారు. ప్ర‌స్తుతం సుమారు 208 గిగావాట్‌ పునరుత్పాదక ఇంధనాన్ని మ‌న‌దేశం ఉత్పత్తి చేస...