మరో వాహనం కాలిపోయింది..
ఈసారి Pure EV వంతు..
చెన్నైలో Pure EV ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మంటలు అంటుకొని కాలిపోయింది. మార్చి 26న, పూణెలో ఓలా యొక్క S1 ఎలక్ట్రిక్ స్కూటర్‌కు మంటలు అంటుకున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.. అంతకు ముందు ఒకినావా ద్విచక్ర వాహనం కూడా మంటల్లో చిక్కుకుంది.
Ola, Okinawa Autotech కు చెందిన electric vehicles ఎలక్ట్రిక్ వాహనాలు (EV) మంటల్లో చిక్కుకున్న కొద్ది రోజుల తర్వాత, తమిళనాడు రాజధాని చెన్నైలో ఇలాంటి సంఘటన చోటుచేసుకుంది. ఈసారి మన హైదరాబాద్ స్టార్టప్ ప్యూర్ ఈవీ తయారు చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు చెలరేగడం, ఈవీల భద్రతపై ఆందోళన కలిగిస్తోంది.
ఉత్తర చెన్నైలోని నివాస ప్రాంతమైన మంజంపాక్కంలోని మాథుర్ టోల్ ప్లాజా సమీపంలో జరిగిన ఈ సంఘటన ను కొందరు వీడియో తీసి సోషల్ మీడియా లో షేర్ చేయడం తో అది వైరల్ అయింది. ఈ వీడియో లో స్కూటర్ నుండి పొగలు కక్కుతున్న దృశ్యాలు ఉన్నాయి.
26 సెకన్ల న...