బాహుబలి ట్రక్ rhino 5536 విశేషాలు ఏంటి?
ఇండియాలో తయారైన తొలి భారీ ఎలక్ట్రిక్ ట్రక్ rhino 5536
కిలోమీటర్ ప్రయాణానికి కేవలం రూ.పదే..గుర్గావ్‌కు చెందిన ఇన్‌ఫ్రాప్రైమ్ లాజిస్టిక్స్ టెక్నాలజీస్ (ఐపిఎల్‌టి) సంస్థ రూపొందించిన భారీ ట్రక్ rhino 5536 ఎన్నోవిశేషాలను కలిగి ఉంది. అత్యంత శక్తివంతమైన ఈ రినో 5536 ట్రక్ మన ఇండియాలోనే రూపుదిద్దుకుంది. రినో ట్రక్ 60 టన్నుల బరువు ఉంటుంది. పవర్‌ఫుల్ బ్యాటరీతో పరుగులు పెడుతుంది. ఇందులో 483 బిహెచ్‌పి ఉత్పత్తిని కలిగి ఉన్న ఎలక్ట్రిక్ మోటారును వినియోగించారు. అలాగే 276 కిలోవాట్ల బ్యాటరీని కలిగి ఉంది.
అత్యాధునిక ఫీచర్లు.
సింగిల్ చార్జిపై 200-300 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ పేర్కొంది. ఫుల్‌లోడ్‌తో సుమారు 300కిలోమీటర్లు, లోడ్ లేకుండా సుమారు 400కిలోమీటర్లు వెళ్తుంది.16కేవీ ఫాస్ట్ చార్జర్ సాయంతో ఈ వాహనం బ్యాటరీని కేవలం గంటలోనే ఫుల్ చార్జ్ చేయవచ్చ...