హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్.. బ్యాటరీ ఛార్జీపై బెంగ లేదు..

Honda Activa Electric
Spread the love

Honda Activa Electric : దేశంలోనే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్ యాక్టివా ఇ (Honda Activa E) ని భారత మార్కెట్లో ఇటీవలే విడుదల చేసింది. డెలివరీలు సైతం ప్రారంభమయ్యాయి స్కూటర్‌ను ముందస్తుగా బుక్ చేసుకున్న కస్టమర్లు ఇప్పుడు తమ యూనిట్లను అందుకుంటున్నారు. యాక్టివా ఇ (Activa E ) రెండు వేరియంట్లలో వస్తుంది

యాక్టివా ఇ స్టాండర్డ్, యాక్టివా ఇ రోడ్‌సింక్ డుయో, ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన లక్షణాలను కలిగి ఉంటుంది.

యాక్టివా ఎలక్ట్రిక్: వేరియంట్లు.. తేడాలు

Activa e Standard, Activa e RoadSync Duo మధ్య ప్రాథమిక వ్యత్యాసం వాటి డిస్ప్లే, కనెక్టివిటీ ఫీచర్స్

యాక్టివా ఇ స్టాండర్డ్ (Activa e Standard) : 5-అంగుళాల TFT డిస్ప్లేను కలిగి ఉంది. కానీ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ లేదు.
యాక్టివా ఇ రోడ్‌సింక్ డుయో (Activa e RoadSync Duo ) : అధునాతన 7-అంగుళాల TFT డిస్ప్లే, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, లైవ్ ట్రాకింగ్, నావిగేషన్, కాల్/SMS అలర్ట్, మ్యూజిక్ కంట్రోల్, OTA అప్ డేట్ వంటి ఫీచర్లు ఉంటాయి.
రెండు వేరియంట్లు రిమూవబుల్ 1.5kWh బ్యాటరీ ప్యాక్‌లతో వస్తాయి. పూర్తి ఛార్జ్‌కు 102 కి.మీ మైలేజీని ఇస్తాయి.

హోండా యాక్టివా ఇ ధర

యాక్టివా ఇ స్టాండర్డ్: రూ. 1,17,000 (ఎక్స్ -షోరూమ్)
యాక్టివా ఇ రోడ్‌సింక్ డుయో: రూ. 1,51,60 0 (ఎక్స్-షోరూమ్)

హోండా యాక్టివా ఎలక్ట్రిక్: స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

Honda Activa Electric Specifications :

మార్చుకోగల బ్యాటరీ టెక్నాలజీ: వినియోగదారులు హోండా ఛార్జింగ్ స్టేషన్లలో డిశ్చార్జ్ చేయబడిన బ్యాటరీలను పూర్తిగా ఛార్జ్ చేయబడిన వాటితో సులభంగా మార్చుకోవచ్చు.

  • పూర్తిగా ఛార్జ్ పై రేంజ్ : 102 కి.మీ.
  • మోటార్ : 6kW PMSM మోటార్.
  • గరిష్ట వేగం : 80 కి.మీ/గం.
  • బ్రేకింగ్ సిస్టమ్ : ముందు డిస్క్ & వెనుక డ్రమ్ బ్రేక్‌లు.
  • డిస్ప్లే : 7-అంగుళాల TFT (రోడ్‌సింక్ డ్యూయో) | 5-అంగుళాల LCD (స్టాండర్డ్).
  • అదనపు ఫీచర్లు : USB టైప్-C సాకెట్, సీటు కింద స్టోరేజ్
  • రైడింగ్ మోడ్‌లు : ఎకో, స్టాండర్డ్, స్పోర్ట్.
  • ఛార్జింగ్ సమయం : ఇంట్లో పూర్తిగా ఛార్జ్ చేయడానికి 6-7 గంటలు.

స్వాపింగ్ బాటరీ విధానంతో ప్రయోజనం

హోండా యాక్టీవా ఎలక్ట్రిక్ స్కూటర్ లో వినూత్నమైన స్వాప్పబుల్ బ్యాటరీ వ్యవస్థ వల్ల గంటల కొద్దీ ఛార్జింగ్ కోసం వేచిఉండాల్సిన బాధను తొలగిస్తుంది. ప్రత్యేకమైన హోండా ఛార్జింగ్ స్టేషన్లతో, వినియోగదారులు కేవలం ఒక నిమిషంలో చార్జింగ్ లేని బ్యాటరీ తీసి పూర్తిగా ఛార్జ్ చేసిన దానితో మార్చుకోవచ్చు. ఈ ప్రక్రియ చాలా సులభం.. బ్యాటరీని తీసివేసి, ఛార్జింగ్ డాక్‌పై ఉంచాలి. ఛార్జ్ చేయబడిన దాన్ని స్కూటర్‌లోకి అమర్చితే సరిపోతుంది.

Honda Activa eSpecifications
Battery-1.5 kWh * 2 (Swappable Battery)
MotorPMSM Direct drive
Range102 Kms
Weight119 Kgs
Seat Height675 mm
Peak power6 kW
Max Torque22 Nm
Top speed80 km/h
Riding modesEcon/Standard/Sport

హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *