ఒక్కసారి ఛార్జ్ చేస్తే 280 కి.మీ ప్రయాణించవచ్చు.. అదిరిపోయే ఫీచర్లతో Rivot Motors NX100 ఎలక్ట్రిక్ స్కూటర్
Rivot Motors కంపెనీ తాజగా Rivot NX100 పేరుతో అత్యధిక రేంజ్ నిచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణిని ఆవిష్కరించింది. ఇందులో క్లాసిక్, ప్రీమియం, ఎలైట్, స్పోర్ట్స్, ఆఫ్‌ల్యాండర్‌తో సహా ఐదు వేరియంట్‌లు ఉన్నాయి. వీటిలో ప్రతి ఒక వేరియంట్ దేనికదదే బిన్నమైన ప్రాధాన్యతలు, ఫీచర్లను కలిగి ఉన్నాయి. వీటి ఎక్స్ షోరూం ధరలు రూ. 89,000 నుంచి ప్రారంభవమవుతున్నాయి.స్ట్రీట్ రైడర్ వేరియంట్.. క్లాసిక్, ప్రీమియం.. ఎలైట్‌తో సహా మూడు ఉప-వేరియంట్‌లతో వస్తుంది. ఇది 7 రంగులలో - నలుపు, తెలుపు, గ్రే, మినరల్ గ్రీన్, పిస్తా, పింక్ తోపాటు పర్పుల్ లో అందుబాటు ఉంటుంది. ఇక స్పోర్ట్స్ వేరియంట్.. వైట్, ఆరెంజ్ డ్యూయల్ టోన్‌లో వస్తుంది. ఆఫ్‌ల్యాండర్, టాప్-ఎండ్ వేరియంట్ డెజర్ట్ రంగులో వస్తుంది.Rivot Motors ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ అప్‌గ్రేడబుల్ రేంజ్ ను కలిగి ఉంది. ఇక్కడ కొనుగోలుదారులు వారి అవసరాలకు తగినట్లు ప్రస్తుత వాహనాలను అప...