
₹13,000 కోట్లతో ‘మష్రూమ్ మిషన్’! (MushroomMission)
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద పుట్టగొడుగుల ఉత్పత్తిదారుగా నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. సుమారు ₹13,000 కోట్ల పెట్టుబడితో దేశంలోనే మొట్టమొదటి 'మష్రూమ్ మిషన్' (MushroomMission) కు ఏపీ శ్రీకారం చుట్టబోతోంది.లక్ష్యం: బీహార్‌ను అధిగమించి అగ్రస్థానానికి..ప్రస్తుతం ఏడాదికి 45,000 టన్నుల ఉత్పత్తితో బీహార్ దేశంలో మొదటి స్థానంలో ఉంది. ఈ మిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తన వార్షిక ఉత్పత్తిని 67,500 టన్నులకు పెంచి, దేశంలోనే నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.MushroomMission : కీలక అంశాలు:భారీ సబ్సిడీ : మొత్తం ₹13,000 కోట్ల వ్యయంలో 40 శాతం అంటే దాదాపు ₹5,184 కోట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ రూపంలో రైతులకు అందజేయనున్నాయి.యూనిట్ల ఏర్పాటు: రాష్ట్రవ్యాప్తంగా 1.62 లక్షల ప...

