Solar Rooftop Subsidy | సోలార్ రూఫ్‌టాప్ తో కరెంట్ బిల్ జీరో.. ఇంకా అదనపు ఆదాయం..? సబ్సిడీకి ఇలా అప్లై చేయాలి..
Solar Power | కరెంట్ కోతలను తప్పించుకోవడానికి మీ ఇంటికి సోలార్ పవర్ యూనిట్ (Solar Power Unit) ను ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? సోలార్ పవర్ యూనిట్ పై ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తుంది. అయితే ఈ సోలార్ సిస్టమ్ ను ఎలా ఏర్పాటు చేసుకోవాలి. ప్రభుత్వ సబ్సిడీ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి. అనే అంశాల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..
సోలార్ రూఫ్‌టాప్ సబ్సిడీని ఎవరు పొందవచ్చు?
Solar Rooftop Subsidy : రెసిడెన్షియల్ సెక్టార్ గ్రిడ్-కనెక్ట్ చేయబడిన సోలార్ రూఫ్‌టాప్ ప్రాజెక్ట్‌లకు మాత్రమే కేంద్రం ప్రభుత్వ ఆర్థిక సహాయం (CFA లేదా సబ్సిడీ) అందుబాటులో ఉంటుంది. ఇతర రంగాలకు ఉదా, ప్రభుత్వ, సంస్థాగత, సామాజిక, వాణిజ్య, పారిశ్రామిక మొదలైనవి. CFA అందుబాటులో లేదు.సోలార్ సబ్సిడీని పొందేందుకు వినియోగదారులు ఎంప్యానెల్డ్ విక్రేతల (డిస్కామ్‌ల ద్వారా) ద్వారా మాత్రమే సిస్టమ్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.
సోలార్ రూఫ...