రూ.25వేలకే Stryder Zeeta e-bike
Stryder Zeeta e-bike : టాటా-ఆధారిత స్ట్రైడర్ కంపెనీ తాజాగా తన Zeeta ఇ-సైకిల్‌ను ప్రకటించింది. దీని అసలు ధర రూ.31,999. కాగా, పరిమిత కాల డిస్కౌంట్ కింద 20% తగ్గింపుతో రూ. 25,599 ధరకు విక్రయించనుంది. ఇ-బైక్ ఆకుపచ్చ, బూడిద రంగులలో అందుబాటులో ఉంది.
స్ట్రైడర్ Zeeta e-bike లో 36 V 250 W BLDC రియర్ హబ్ మోటార్ అమర్చబడి ఉంది. ఇది అన్ని భూభాగాలపై మృదువైన ప్రయాణాన్ని అందిస్తుందని పేర్కొంది. ఈ ఇ-బైక్ లోపల ఫ్రేమ్ లిథియం-అయాన్ బ్యాటరీ , కంట్రోలర్‌తో వస్తుంది. దీనిని 3 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు. ఒక ఛార్జ్‌పై హైబ్రిడ్ రైడ్ మోడ్‌లో 40 కిమీల పరిధిని అందిస్తుంది. ఇది ఆటో కట్ బ్రేక్‌లు వంటి సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంది. అన్నింటికంటే ఎక్కువగా, జీటా ప్రతి కిలలోమీటర్‌కు 10 పైసల ఇంధనాన్ని క్లెయిమ్ చేసింది. ఈ కొత్త Zeeta e-bike వోల్టిక్ 1.7, ఇటిబి 100, వోల్టిక్ గో వంటి ఇతర ఇ-బైక్ మోడళ్ల శ్రేణిలో చేరింది.
St...