Stubble Burning : వ్యవసాయ వ్యర్థాలను దహనం చేస్తున్నారా? అయితే రూ.30,000 జరిమానా చెల్లించాల్సిందే..
Stubble Burning Penalties : ఢిల్లీలో విపరీతంగా వాయు కాలుష్యం (Air Pollution) పెరిగిపోయి గాలి నాణ్యత క్షీణించడంతో కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమించింది. వ్యవసాయ వ్యర్థాలు తగులబెట్టినందుకు జరిమానాలను భారీగా పెంచింది, ఇప్పుడు జరిమానా రూ. 30,000కి చేరుకుంది. వ్యవసాయ అవశేషాలను కాల్చడం వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడానికి సవరించిన నిబంధనల ప్రకారం, తక్షణమే అమలులోకి వస్తుంది. వ్యవసాయ భూమి పరిమాణం ఆధారంగా జరిమానాలను వర్గీకరించింది. దేశ రాజధాని ఢిల్లీ (Delhi ) పరిసర ప్రాంతాలలో…
