Harithamithra Telugu News

Thursday, April 30Agriculture - Green Mobility - Clean Energy
Shadow

Stubble Burning : వ్య‌వ‌సాయ వ్య‌ర్థాల‌ను ద‌హ‌నం చేస్తున్నారా? అయితే రూ.30,000 జ‌రిమానా చెల్లించాల్సిందే..

Stubble Burning Penalties : ఢిల్లీలో విప‌రీతంగా వాయు కాలుష్యం (Air Pollution) పెరిగిపోయి గాలి నాణ్యత క్షీణించ‌డంతో కేంద్రం క‌ఠిన చ‌ర్య‌ల‌కు ఉప‌క్ర‌మించింది. వ్య‌వ‌సాయ వ్య‌ర్థాలు తగులబెట్టినందుకు జరిమానాలను భారీగా పెంచింది, ఇప్పుడు జరిమానా రూ. 30,000కి చేరుకుంది. వ్యవసాయ అవశేషాలను కాల్చడం వల్ల కలిగే కాలుష్యాన్ని తగ్గించడానికి సవరించిన నిబంధనల ప్రకారం, తక్షణమే అమలులోకి వస్తుంది. వ్యవసాయ భూమి పరిమాణం ఆధారంగా జరిమానాలను వర్గీకరించింది.

  • రెండు ఎకరాల కంటే తక్కువ ఉన్న రైతులకు రూ.5,000 జరిమానా విధిస్తారు.
  • రెండు నుంచి ఐదు ఎకరాలు ఉన్న వారికి రూ.10,000 జరిమానా విధిస్తారు.
  • ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకు రూ. 30,000 జరిమానా విధిస్తారు.

దేశ రాజ‌ధాని ఢిల్లీ (Delhi ) పరిసర ప్రాంతాలలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కోసం ( వ్య‌వ‌సాయ వ్య‌ర్థాల ద‌హ‌నంపై చ‌ర్య‌ల‌కు సంబంధించి ) కేంద్రం కొత్త నియ‌మావ‌ళిని విడుద‌ల చేసింది. గతంలో విధించిన జరిమానాలను ఏ మత్రం ప్ర‌భావం చూప‌డం లేద‌ని గతంలో సుప్రీంకోర్టు తీవ్ర విమర్శలు చేసిన‌ నేపథ్యంలో కేంద్రం కఠినమైన జరిమానాలు విధించింది. అధికారులను నియమించడంలో జాప్యం, పటిష్టమైన ప‌ర్య‌వేక్ష‌ణ‌ యంత్రాంగం లేకపోవడాన్ని పేర్కొంటూ, పాత ఫ్రేమ్‌వర్క్ అసమర్థతను ఉన్నత న్యాయస్థానం ఎత్తి చూపింది.

ఈ ఏడాది ఢిల్లీ వాయు కాలుష్య సంక్షోభం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. బుధవారం, దేశ రాజధాని ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 356 ను చేరింది. దీనిని వెరీ పూర్ గా వర్గీకరించారు, దట్టమైన పొగ రాజధానిని చుట్టుముట్టింది. చలికాలంలో ఈ ద‌హ‌నాల వ‌ల్ల ఈ ప‌రిస్థితి మ‌రింత‌ ఆందోళనకరంగా మార్చేసింది.

సవరించిన నియమాలు కాలుష్య నియంత్రణ బోర్డులు, CAQM ఫిర్యాదులను నిర్వహించడానికి, విచారణలు, ఫిర్యాదుల పరిష్కారానికి స్పష్టమైన మార్గదర్శకాలతో జరిమానాలను అమలు చేయడానికి అధికారం కల్పిస్తాయి. ఈ చర్యలు గడ్డివాము దహనాన్ని నిరోధించగలవని.. విషపూరితమైన గాలితో బాధపడుతున్న లక్షలాది మందికి ఉపశమనం కలిగిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.

హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

Harithamithra

👉 “Eco friendly & environmental news updates for Free”

వ్యవసాయం, సోలార్​​ ఎనర్జీ, గ్రీన్​ మొబలిటికి సంబంధించిన అప్‌డేట్స్​ను ఉచితంగా పొందండి!"

We don’t spam! Read our privacy policy for more info.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🌱 పర్యావరణ వార్తలు వెంటనే తెలుసుకోండి!

Green Mobility, Solar, EV, Environment కి సంబంధించిన తాజా వార్తలు కోసం Harithamitra ను Follow అవ్వండి.

♻️ Harithamitra – పర్యావరణానికి మీ డిజిటల్ మిత్రుడు

Maruti Suzuki e Vitara EV Price, Range, Features Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు MG Comet EV 2025 | 4.99 లక్షల ధరకు లాంచ్.. కొత్త ఫీచర్లు ఇవే.. Top 7 Health Benefits of Dates