సుజుకి మోటార్ EV కారు.. ఇ-విటారా లాంచ్..
Suzuki Motor | మారుతీ సుజుకి తన మొదటి ఎలక్ట్రిక్ కారు ఇ-వితారా (EV model e-Vitara) ను సోమవారం మిలన్‌లో ఆవిష్కరించింది. ఇది ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్‌లోకి కంపెనీ ముందడుగు వేసినట్లైంది. వచ్చే ఏడాది గుజరాత్ యూనిట్‌లో ఉత్పత్తిని ప్రారంభించనుంది. 2025 వేసవిలో యూరప్, భారత్, జపాన్‌తో సహా వివిధ దేశాల్లో విక్రయాలు ప్రారంభమవుతాయ కంపెనీ వెల్లలడించింది. సుజుకి మోటార్ కార్పొరేషన్ తన మొదటి భారీ ఉత్పత్తి బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ (BEV)ని ఆవిష్కరించింది.Suzuki Motor e-Vitara జనవరి 2023లో భారతదేశంలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడిన 'Evx' అనే కాన్సెప్ట్ మోడల్‌పై ఆధారపడింది. మారుతి EV కారు.. టాటా Curvv EV, రాబోయే హ్యుందాయ్ క్రెటా EV, మహీంద్రా BE 05 వంటి ఎలక్ట్రిక్ వాహనాలకు గట్టిపోటీ ఇవ్వనుంది.e Vitara రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. అవి- 49 kWh మరియు 61 kWh. ఏది ఏమైనప్పటికీ, రె...