Maruti Suzuki EV : మారుతీ సుజుకీ నుంచి త్వరలో ఎలక్ట్రిక్ కారు..
Maruti Suzuki EV : ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి శుభవార్త త్వరలో సరికొత్త ఎలక్ట్రిక్ కారు రాబోతోంది. తక్కువ ధరల్లో కార్లను అందుబాటులోకి తీసుకొచ్చిన మారుతి ఈ ఏడాది ఎలక్ట్రిక్ కారును విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది మారుతి సుజుకీ ఇటీవల వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌లో తన తొలి ఎలక్ట్రిక్ SUV eVX ప్రొడక్షన్ వెర్షన్ ను ప్రదర్శించిన విషయం తెలిసిందే.. అయితే అన్నీ సవ్యంగా జరిగితే ఈ సంవత్సరం దీపావళికి ముందు ఈ కారును అధికారికంగా భారతదేశంలో లాంచ్ చేయవచ్చు. నివేదికల ప్రకారం, Maruti Suzuki EV Car ధర రూ. 10లక్షల కంటే ఎక్కువగా ఉండొచ్చు. మరోవైపు తక్కువ ధరల్లో ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కార్ల మార్కెట్‌పై కూడా మారుతి దృష్టి పెట్టిందనే వార్తలు కూడా చక్కర్లు కొడుతున్నాయి.ప్రస్తుతం భారతీయ మార్కెట్లో టాటా ఎలక్ట్రిక్ వాహనాలు రాజ్యమేలుతున్నాయి. టాటా టియాగో EV, టాటా టిగోర్ చాలా పాపులర్ అయ్యాయి. ఇటీవలే ట...