
New Market Yards | రాష్ట్రంలో 10 కొత్త మార్కెట్ యార్డులు
నాగర్‌కర్నూల్, వనపర్తి, ఖమ్మం, నల్గొండ, హనుమకొండ, పెద్దపల్లి జిల్లాల్లో కొత్త యార్డులుపంట కొనుగోలు, ధరల నిర్ధారణ, తూకం లావాదేవీలన్నీ పారదర్శకంగా నిర్వహణరైతుల భద్రత, రవాణా ఖర్చుల తగ్గింపు, కోల్డ్ స్టోరేజ్, గిడ్డంగులు వంటి సదుపాయాలుHyderabad : తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో 10 కొత్త మార్కెట్ యార్డులు (New Market Yards) ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన తుది ఉత్తర్వులు జారీ చేయనుంది. దీంతో తెలంగాణలో మార్కెట్ యార్డుల సంఖ్య 197 నుంచి 207కి చేరుతుంది.కొత్త మార్కెట్ యార్డులను నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు, అదే జిల్లాలోని పెద్దకొత్తపల్లి, పెద్దపల్లి జిల్లా ఎలిగేడు, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, వనపర్తి జిల్లా పానగల్, వీవనగండ్ల, ఖిలాఘ ర్, గోపాల్‌పేట, ఖమ్మం జిల్లా మత్కేపల్లి, నల్గొండ జిల్లా దామరచర్...