
తెలంగాణలో భారీ స్థాయిలో సోలార్ విద్యుత్ ఉత్పత్తి – Solar Power Project
ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలపై సోలార్ ప్లాంట్లుఏజెన్సీ ప్రాంతాల్లో ఉచిత సోలార్ పంపుసెట్లుఖాళీ స్థలాలను వినియోగించి విద్యుత్ ఉత్పత్తిTelangana Solar Power Project | రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ విద్యుత్ ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన సచివాలయంలో ప్రభుత్వ భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు, ఆర్ఓఎఫ్ఆర్ భూముల్లో ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం అమలుపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ప్రభుత్వ కార్యాలయాల ప్లాన్లు పంపించండిఅన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, పార్కింగ్, క్యాంటీన్ ప్లాన్లు అందజేయాలని హైదరాబాద్ కు పంపాలని డిప్యూటీ సీఎం సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు అన్నీ...