పచ్చదనానికి చిరునామా దేవాలయాలు..
ఆలయాలను హరితవనాలుగా తీర్చిదిద్దేందుకు కేరళ ప్రభుత్వం నిర్ణయం
తిరువనంతపురం: కేరళలో వాతావరణ మార్పుల ప్రభావాలను ఎదుర్కోవడానికి, CPI(M) నేతృత్వంలోని ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న ఐదు Devaswom Boards నిర్వహిస్తున్న 3,000 దేవాలయాలలో మొక్కల పెంపకానికి ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. అంతేకాకుండా, రాష్ట్రంలోని పాడుబడిన ఆలయ చెరువులను పునరుద్ధరించడం, తోటలను రక్షించడం ద్వారా నీటి వనరులను సంరక్షించడం కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉంది. green cover in templesప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఇక్కడి ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డు (టీడీబీ) ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో రాష్ట్ర దేవస్వామ్ మంత్రి కే రాధాకృష్ణన్ మొక్కలు నాటడం ద్వారా ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసి రాష్ట్రంలోని అన్ని దేవస్వం బోర్డులకు సర్క్యులేట్ చేశామని ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు అధ్యక్షుడు కె.అనంతగోపాలన్ తెలిపారు...