Wheat | ఏడాదికి ఆరు పంటలిచ్చే గోధుమ.. డయాబెటిస్ ను కట్టడి చేసే మరో కొత్త వంగడం..
జర్మనీ పరిశోధకుల నుంచి సరికొత్త వంగడం
కేవలం పది వారాల్లోనే పంట చేతికి
నీటి వినియోగం కూడా 95 శాతం తక్కువేఒకవైపు పెరుగుతున్న జనాభా, మరోవైపు వాతావరణ మార్పుల వల్ల వరదలు, కరువు కాటకాలు ఆహార సంక్షోభానికి దారితీస్తోంది. పలు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కూడా ఇందుకు మరో అవరోధంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ (డబ్ల్యూఎఫ్ పీ) అంచనాల ప్రకారం.. ప్రపంచంలో ఇప్పటికే 82.8 కోట్ల మంది ఆకలితో అల్లాడిపోతున్నారు. ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది 49 దేశాల్లో కరువు పరిస్థితులు తలెత్తే ప్రమాదముందని డబ్ల్యూఎఫ్ పీ హెచ్చరించింది. అలాగే ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో ఆకలి కేకలను పెంచేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో జర్మనీ పరిశోధకులు ఊహించని శుభవార్త చెప్పారు.
ఏడాదికి ఏకంగా ఆరు సార్లు పంట దిగుబడినిచ్చే ప్రత్యేక గోధుమ Wheat వంగడాన్ని రూపొందించినట్లు మ్యూనిచ్ వర్...