Bharat NCAP : మహీంద్రా XEV 9e వేరియంట్ కు 5-స్టార్ రేటింగ్
Bharat NCAP : భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (BNCAP) మహీంద్రా XEV 9e వేరియంట్‌తోపాటు BE 6 లపై క్రాష్ పరీక్షలను నిర్వహించింది. ఈ రెండు మోడల్‌లు పెద్దలు, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో ఆకట్టుకునే విధంగా 5-స్టార్ రేటింగ్‌ను సాధించాయి. ముఖ్యంగా SUVలలో అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ స్కోర్‌లు BNCAP నుంచి అత్యధికంగా రేటింగ్ పొందిన వాహనాలుగా నిలిచాయి. ఈ రెండింటిలో, మహీంద్రా XEV 9e కొంచెం మెరుగైన స్కోర్‌తో BE 6ని అధిగమించింది.79 kWh బ్యాటరీ ప్యాక్‌తో మహీంద్రా XEV 9e టాప్-స్పెక్ ప్యాక్ త్రీ వేరియంట్‌ను Bharat NCAP పరీక్షించింది. అయితే, అదే రేటింగ్ 59 kWh వేరియంట్‌లకు కూడా వర్తిస్తుందని నివేదిక పేర్కొంది.Mahindra XEV 9e స్కోర్ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బ్యారియర్, సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లు రెండింటిలోనూ, XEV 9e 16 పాయింట్లలో పూర్తి 16 స్కోర్ చేసింది. ఇది అడ...