Xiaomi EV | షావోమి నుంచి స్మార్ట్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ కార్లు..
Xiaomi EV : చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ షావోమి తొలిసారిగా ఎలక్ట్రిక్ కారును విడుదల చేస్తోంది. షావోమి ఎస్‌యూ 7 (Xiaomi su7 ) పేరుతో తీసుకొస్తున్న ఈ కారు విక్రయించేందుకు గాను ప్రభుత్వానికి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ కారును షావోమీ బీజింగ్ ఆటోమోటివ్ ఇండస్ట్రీ హోల్డింగ్ కంపెనీ లిమిటెడ్ (బీఏఐసీ)కి కాంట్రాక్టు ఇచ్చింది. చైనా ఇండస్ట్రీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అనుమతి కోసం కంపెనీ అప్లికేషన్ పెట్టుకుంది.
మూడు వేరియంట్లతో Xiaomi EV
కాగా ఈ శాఖ ప్రతి నెల కొత్త కార్ల వివరాలను వెల్లడిస్తుంటుంది.. షావోమి కారు వివరాలు ఈ సంస్థ వెబ్‌సైట్ ద్వారానే వెలుగులోకి వచ్చింది. బీఏఐసీ వోఆర్‌వీ షావోమి బ్రాండెడ్ మోడల్‌లో 3 వెరియంట్లను తయారు చేయనుంది.. ఎస్‌యూ 7 మోడల్ ఎలక్ట్రిక్ కారులో బీవైడీ కంపెనీకి చెందిన లిథియం ఆయాన్ పాస్పేట్ బ్యాటరీని వినియోగిస్తున్నారు. కాగా ఈ ...