ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్: ఈవీ వాహనాల కొనుగోలుపై 20% వరకు డిస్కౌంట్! ‌‌‌‌‌‌–Telangana EV Policy

ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే ఆఫర్: ఈవీ వాహనాల కొనుగోలుపై 20% వరకు డిస్కౌంట్! ‌‌‌‌‌‌–Telangana EV Policy

  • ఈవీ వాహనాలు కొనుగోలు చేసే ప్రభుత్వ ఉద్యోగులకు కంపెనీల నుండి 10-20 శాతం డిస్కౌంట్
  • సెక్రటేరియట్ లో ఉద్యోగులకు ఈవీ వాహనాల ప్రోత్సాహకాన్ని ప్రారంభించిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సిఎస్ రామకృష్ణ రావు, డీజీపీ శివధర్ రెడ్డి

Telangana EV Policy : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని ప్రోత్సహించడానికి మరో భారీ అడుగు వేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఈవీ వాహనాలను కొనుగోలు చేస్తే ప్రముఖ తయారీ కంపెనీల నుండి 10 నుండి 20 శాతం వరకు ప్రత్యేక డిస్కౌంట్ లభించేలా రవాణా శాఖ ఒప్పందాలు కుదుర్చుకుంది. సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డిలతో కలిసి ఈ ప్రోత్సాహక కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

Telangana EV Policy – ముఖ్యాంశాలు:

రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న ఈవీ పాలసీ ద్వారా ఇప్పటికే అనేక ప్రయోజనాలు అందుతున్నాయి:

  • 100% పన్ను మినహాయింపు: ఎలక్ట్రిక్ వాహనాలపై రోడ్డు టాక్స్ మరియు రిజిస్ట్రేషన్ ఫీజులను పూర్తిగా రద్దు చేశారు.
  • భారీ రాయితీ: ఈ పాలసీ ద్వారా ఇప్పటివరకు 1,15,551 వాహనాలకు గానూ ప్రభుత్వం సుమారు రూ. 925.94 కోట్ల ఆదాయాన్ని వదులుకొని పర్యావరణం కోసం ఖర్చు చేసింది.
  • పెరిగిన వినియోగం: గతంలో కేవలం 0.60 శాతంగా ఉన్న ఈవీ వినియోగం, ప్రస్తుతం 1.50 శాతానికి పెరగడం విశేషం.

ప్రముఖ కంపెనీల భాగస్వామ్యం

ప్రభుత్వ ఉద్యోగులకు 10-20 శాతం డిస్కౌంట్ ఇచ్చేలా మహీంద్రా ఎలక్ట్రిక్స్, ఆథర్ ఎనర్జీ, గ్రావిటన్ మోటార్స్, ఓలా తో పాటు పలు కంపెనీలు ముందుకు వచ్చాయని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సెక్రటేరియట్ లో సీఎస్, డీజీపీ, ఉద్యోగ సంఘాల నాయకులతో కలిసి ఈవీ వాహనాలను పరిశీలించారు. వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈవి వాహనాలు ఉపయోగించేలా డిస్కౌంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Telangana EV Policy వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఈవీ వాహనాల వినియోగం 0.60 నుండి 1.50 శాతం పెరిగిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడానికి సుస్థిర రవాణాను ప్రోత్సహించడం, సాంప్రదాయ ఇంధనాలపై ఆధారపడడం తగ్గించడానికి ప్రభుత్వం విస్తృత ప్రయత్నాల్లో బాగంగా ఉద్యోగులకు 10-20 శాతం డిస్కౌంట్ వచ్చేలా ఈవి కంపెనీలతో ఒప్పందం చేసుకుంది.

నార్వే, చైనాలతో పోటీగా తెలంగాణ

రాష్ట్ర ప్రభుత్వం నుండి కొనే వాహనాలు కూడా ఎలక్ట్రిక్​ వాహనాలు ఉండేలా ఇటీవల జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి సూచించారని అందుకు హైర్ పద్ధతిలో లేదా డిపార్ట్మెంట్ ల నుండి వాహనాలు తీసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యుత్ వాహనాల వినియోగంలో తెలంగాణ నార్వే,చైనా లతో పోటీపడుతుందని తెలిపారు. ఈవి వాహనాలకు ఇబ్బందులు లేకుండా అన్ని ప్రాంతాల్లో ఈవి ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

క్యూర్ ఏరియా లో ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి.. క్యూర్ ఏరియా లో డీజిల్ ఆటో లు కూడా రిటైరోఫిట్ గా మార్చి నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రవాణా శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని స్క్రాపేజీ పాలసీ లో భాగంగా 15 సంవత్సరాలు దాటిన వాహనాలు స్క్రాపింగ్ కి పంపిస్తున్నామన్నారు. తెలంగాణ లో వాహన్ , సారథి పోర్టల్ లోకి చేరిందని వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు షో రూమ్ లోనే రిజిస్టేషన్ చేసుకునే అవకాశం ఉంటుందన్నారు.

కాలుష్య రహిత నగరం దిశగా..

నగరాన్ని కాలుష్య రహిత రాష్టంగా తీర్చిద్దాలనే లక్ష్యం తో EV వాహనాలను ప్రభుత్వం తీసుకొస్తుందని 2 వేల కిలోమీటర్ల మేరకు CURE చేయాలని ప్రభుత్వం దృఢ సంకల్పం తో ప్రణాళిక సిద్ధం చేసిందనీ సిఎస్ రామకృష్ణ రావు పేర్కొన్నారు. నగరం లో ఈవి బస్సు లను ఇతర వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు. తెలంగాణ లో అమలు చేస్తున్న ఈవి పాలసీ ద్వారా కాలుష్యాన్ని నివారించవచ్చనీ ఆకాంక్షించారు. పెద్ద పెద్ద పట్టణాల్లో ఎయిర్ క్వాలిటీ తగ్గుతుందని రాష్ట్రంలో 30 శాతం జనాభా హైదరాబాద్ లోనే నివసిస్తుందన్నారు.

ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈవీ వాహనాల ధరల అంచనా పట్టిక (Estimated Discounts)

కింద పేర్కొన్న ధరలు ఎక్స్-షోరూమ్ ధరల మీద కంపెనీలు ప్రకటించిన 10% నుండి 20% డిస్కౌంట్ల ఆధారంగా లెక్కించబడ్డాయి. (గమనిక: ఖచ్చితమైన ఆఫర్ కోసం మీ దగ్గరలోని షోరూమ్‌ను సంప్రదించాల్సి ఉంటుంది).

ఈవీ కంపెనీ & మోడల్అసలు ధర (సుమారు)ప్రభుత్వ ఉద్యోగి డిస్కౌంట్ఆఫర్ ధర (అంచనా)
Ather 450X (2.9 kWh)₹1,40,00015%₹1,19,000
Ola S1 Pro (Gen 2)₹1,35,00010% – 15%₹1,14,750
Mahindra XUV400 (EV)₹15,49,00010%₹13,94,100
Gravton Quanta₹1,15,00020%₹92,000
Ola S1 Air₹1,05,00010%₹94,500

Telangana EV Policy : ఈ ఆఫర్ ఎలా పొందాలి?

ప్రభుత్వ ఉద్యోగులు ఈ ప్రయోజనాన్ని పొందడానికి వాహనం కొనుగోలు చేసే సమయంలో ఈ క్రింది పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది:

  • ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపు కార్డు (Employee ID Card).
  • ప్రస్తుత నెల పే-స్లిప్ (Latest Pay Slip).
  • ఆధార్ కార్డ్ మరియు ఇతర ప్రాథమిక పత్రాలు.

పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు అవుదాం.. హరిత భారతాన్ని నిర్మిద్దాం!

గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ మరియు పర్యావరణానికి సంబంధించిన తాజా విశేషాల కోసం హరితమిత్రను సందర్శిస్తూ ఉండండి. నిరంతర వార్తా అప్‌డేట్స్ కోసం మా సోషల్ మీడియా వేదికలపై కనెక్ట్ అవ్వండి:

ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. పర్యావరణం పట్ల అవగాహన పెంచేలా ఈ కథనాన్ని మీ స్నేహితులకు షేర్ చేయండి! 🌳✨

Harithamithra

👉 “Eco friendly & environmental news updates for Free”

వ్యవసాయం, సోలార్​​ ఎనర్జీ, గ్రీన్​ మొబలిటికి సంబంధించిన అప్‌డేట్స్​ను ఉచితంగా పొందండి!"

We don’t spam! Read our privacy policy for more info.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🌱 పర్యావరణ వార్తలు వెంటనే తెలుసుకోండి!

Green Mobility, Solar, EV, Environment కి సంబంధించిన తాజా వార్తలు కోసం Harithamitra ను Follow అవ్వండి.

♻️ Harithamitra – పర్యావరణానికి మీ డిజిటల్ మిత్రుడు