Tork Motors నుంచి హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ బైక్‌లు

Spread the love

Kratos, Kratos R Electric Bikes విడుద‌ల  

గంట‌కు 100కి.మి వేగం.. సింగిల్ చార్జ్‌పై 180కి.మి రేంజ్

Kratos

భారత్ ఫోర్జ్-ఆధారిత స్టార్టప్ కంపెనీ Tork Motors .. తాజాగా రెండు ఎలక్ట్రిక్ బైక్‌ల‌ను విడుదల చేసింది

క్రాటోస్ (Kratos), క్రాటోస్ ఆర్ (Kratos R) పేరుతో విడుద‌లైన ఈ ఎల‌క్ట్రిక్‌బైక్‌లు గరిష్టంగా 100 kmph వేగంతో 120 కిమీ రేంజ్ ఇస్తాయి. ఎలక్ట్రిక్ బైక్‌(electric motorcycle)ల ధరలు వరుసగా రూ. 1.07 లక్షలు. రూ.1.22 లక్షలు (ఎక్స్-షోరూమ్, పూణే).ఈ ఎల‌క్ట్రిక్ బైక్‌ల‌ను ఇంట్లో ఛార్జ్ చేయవచ్చు అలాగే కంపెనీ ఏర్పాటు చేస్తున్న ఫాస్ట్ ఛార్జింగ్ నెట్‌వర్క్ లోనూ చార్జ్ చేసుకోవ‌చ్చ‌ని కంపెనీ పేర్కొంది.

మొద‌టి ద‌శ‌లో హైద‌రాబాద్‌లో..

ఎలక్ట్రిక్ బైక్‌ను రెండు దశల్లో దేశ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మొద‌టి ద‌శ‌ పూణె, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, ఢిల్లీతో ప్రారంభమవుతుంది. ఈ ఏడాది చివరి నాటికి రెండో దశలో 100 నగరాలకు విస్త‌రించనున్నారు. ఏప్రిల్ 2022 నాటికి మ‌హారాష్ట్క పూణేలో డెలివరీలు ప్రారంభమవుతాయని టోర్క్ మోటార్స్ వ్యవస్థాపకుడు CEO కపిల్ షెల్కే తెలిపారు. ఇది అసెంబుల్డ్ బైక్ కాదని, అన్ని భాగాలను ఇండియాలోనే నిర్మించామని, మోటార్లు కూడా ఇక్క‌డివేన‌ని షెల్కే చెప్పారు.

టోర్క్ మోటార్స్ చకన్‌లో ఏడాదికి 40,000 బైక్‌లను తయారు చేయగల ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ప్లాంట్‌లో ప్ర‌స్తుతం పని జరుగుతోంది. 2022-23 మొదటి త్రైమాసికం చివరి నాటికి ఫ‌స్ట్ ప్రోడ‌క్ట్‌ను ప్రారంభించి పూర్తి స్థాయిలో ప‌నిచేసే అవ‌కాశ‌ముంది. “ఇది మైక్రో-మాన్యుఫ్యాక్చరింగ్ మోడల్, దీనిని మూడు నెలల్లో ప్రతిరూపం చేయవచ్చుఅని షెల్కే తెలిపారు.

భారత్ ఫోర్జ్ కంపెనీ.. 2018లో టోర్క్ మోటార్స్‌లో పెట్టుబ‌డి పెట్టి 48% వాటాను ద‌క్కించుకుంది. టోర్క్‌లోని ఈ వాటా భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ కళ్యాణి పవర్‌ట్రెయిన్‌కు బదిలీ చేయబడింది. నవంబర్ 2021లో, టోర్క్‌లో కళ్యాణి పవర్‌ట్రెయిన్ వాటా 60.66%కి పెరిగింది. ఇప్పుడు కళ్యాణి పవర్‌ట్రెయిన్‌కి అనుబంధంగా మారింది.

టోర్క్ మోటార్స్ ల‌క్ష్యాల‌ను ప‌రిశీలించి తాము 2018లో వ్యూహాత్మక పెట్టుబడిదారుగా వచ్చామని భారత్ ఫోర్జ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ కళ్యాణి తెలిపారు. భవిష్యత్తులో టోర్క్‌తో కలిసి పనిచేయడానికి తాము ఎదురుచూస్తున్నామని కళ్యాణి తెలిపారు.

టోర్క్ ప్రస్తుతం 100 మంది డీలర్ల నెట్‌వర్క్‌ను పెంచుకోవాల‌ని చూస్తోంది. కస్టమర్ల ఇంటి వద్దకే వాహనాల రిమోట్ సర్వీసింగ్‌ను అందిస్తోంది. ఫైనాన్సింగ్ కస్టమర్ల కోసం టోర్క్ HDFC & యాక్సిస్ బ్యాంక్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

Kratos Electric Bikes స్పెసిఫికేష‌న్లు..

క్రాటోస్ (Kratos) ఎల‌క్ట్రిక్ బైక్ 7.5కిలోవాట్స్, 28ఎన్ఎం మోటార్‌ను వినియోగించారు. ఇది కేవ‌లం నాలుగు సెకండ్ల‌లోనే గంట‌కు 40కిలోమీట‌ర్ల వేగాన్ని అందుకుంటుంది.

క్రాటోస్ ఆర్ (Kratos R) 9కిలోవాట్స్‌, 38ఎన్ఎం మోటార్‌ను క‌లిగి ఉంటుంది. ఈ బైక్‌లు గ‌రిష్టంగా 100కిలోమీట‌ర్ల వేగంతో దూసుకుపోతాయి. ఈ రెండు బైక్‌లలో మూడు రైడింగ్ మోడ్‌లు ఉంటాయి. అవి ఎకో, సిటీ మోడ్‌, స్పోర్ట్స్ మోడ్‌.

ఇందులో వినియోగించిన బ్యాట‌రీ ఐపీ67 వాట‌ర్ రెసిస్టెంట్‌ను క‌లిగి ఉంటుంది. ఈ రెండు వాహ‌నాలు సింగిల్ చార్జిపై సుమారు 180కిలోమీట‌ర్ల రేంజిని ఇస్తాయి. ఇందులోని బ్యాట‌రీ గంట‌కు 25శాతం చొప్పున చార్జ్ అవుతుంది. ఫాస్ట్ చార్జ‌ర్‌తో గంట‌లో సుమారు 85శాతం చార్జ్ అవుతుంద‌ని కంపెనీ పేర్కొంది.


మరిన్ని అప్‌డేట్‌ల కోసం హ‌రిత‌మిత్ర వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు సంబంధించిన వీడియోల కోసం మా  Haritha mithra YouTube ఛానెల్‌ను స‌బ్‌స్క్రైబ్ చేసుకోండి.!

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..