- రెండు బ్యాటరీ ఆప్షన్లు: 49kWh మరియు 61kWh LFP బ్యాటరీ ఎంపికలు.
- భారీ రేంజ్: ఒక్కసారి ఛార్జ్ చేస్తే గరిష్టంగా 543 కి.మీ ప్రయాణం (ARAI).
- బుకింగ్స్: టోకెన్ అమౌంట్ రూ.25,000 తో నేటి నుంచే బుకింగ్స్ ప్రారంభం.
టోయోటా ఇండియా తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ (EV SUV) అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా (Urban Cruiser Ebella) ను భారత మార్కెట్లో ఆవిష్కరించింది. మారుతి సుజుకి ‘ఇ-విటారా’కు ఇది సిబ్లింగ్ మోడల్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవీ..
డిజైన్ (Exterior)
హామర్ హెడ్ డిజైన్: టోయోటా గ్లోబల్ డిజైన్ లాంగ్వేజ్‌తో కూడిన సరికొత్త ఫ్రంట్ లుక్.
లైటింగ్: సెగ్మెంటెడ్ LED DRLలు మరియు ట్రయాంగులర్ హెడ్‌లైట్లు.
వీల్స్: 18-ఇంచుల ఏరో-ఆప్టిమైజ్డ్ అల్లోయ్ వీల్స్.
కలర్స్: 5 మోనోటోన్ (వైట్, బ్లాక్, గ్రే, రెడ్, సిల్వర్) మరియు 4 డ్యూయల్-టోన్ రంగుల్లో లభ్యం.
ఇంటీరియర్, ఫీచర్లు (Interior & Tech)
డిస్‌ప్లే: 10.25-ఇంచుల టచ్‌స్క్రీన్ మరియు 10.1-ఇంచుల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే.
కనెక్టివిటీ: వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు టోయోటా i-Connect (100+ ఫీచర్లు).
సౌకర్యాలు: వెర్టికల్ ఏసీ వెంట్స్, 12-కలర్ యాంబియంట్ లైటింగ్, JBL సౌండ్ సిస్టమ్, వెన్కిలేటెడ్ సీట్లు పనోరమిక్ సన్‌రూఫ్ (టాప్ ఎండ్‌లో).
సీటింగ్: వెనుక సీట్లు స్లైడింగ్ మరియు రెక్లైనింగ్ ఆప్షన్లతో వస్తాయి.
భద్రత (Safety First)
స్టాండర్డ్ ఫీచర్లు: అన్ని వేరియంట్లలో 7 ఎయిర్‌బ్యాగ్‌లు మరియు 4 వీల్స్‌కు డిస్క్ బ్రేక్స్ ప్రామాణికం.
ADAS: లెవల్ 2 ADAS (అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, అటానమస్ బ్రేకింగ్).
కెమెరా: 360-డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా.
ధర (Price & Assurance)
ధరలు అధికారికంగా వెల్లడి కానప్పటికీ, ఇది సుమారు ₹19 లక్షల నుండి ₹25 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉంది. బ్యాటరీపై 8 ఏళ్ల వారంటీ ఉంటుంది. 3 ఏళ్ల తర్వాత 60% బైబ్యాక్ అస్యూరెన్స్. బ్యాటరీ-యాజ్-ఏ-సర్వీస్ (Rental) ప్రోగ్రామ్ కూడా అందుబాటులో ఉంది.
| ఫీచర్ | E1 వేరియంట్ (బేస్) | E2 & E3 వేరియంట్లు (టాప్) |
|---|---|---|
| బ్యాటరీ సామర్థ్యం | 49 kWh | 61 kWh |
| ARAI రేంజ్ | 440 కి.మీ | 543 కి.మీ |
| పవర్ (Power) | 144 hp | 174 hp |
| టార్క్ (Torque) | 189 Nm | 189 Nm |
| డ్రైవ్ సిస్టమ్ | FWD (ఫ్రంట్ వీల్ డ్రైవ్) | FWD (ఫ్రంట్ వీల్ డ్రైవ్) |
| వీల్‌బేస్ | 2700 mm | 2700 mm |
| గ్రౌండ్ క్లియరెన్స్ | 180 mm | 180 mm |
| టైర్లు | 225/55 R18 (అల్లోయ్) | 225/55 R18 (అల్లోయ్) |





