వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ లో తులిప్ గార్డెన్

Spread the love

Tulip Garden : భూతల స్వర్గంగా భావించే కశ్మీర్(Kashmir) లోని శ్రీనగర్ లోని తులిప్ గార్డెన్ మరో రికార్డును కైవసం చేసుకుంది. ఇంద్రధనస్సు నేలకు దిగి తివాచిలా పరుచుకున్నట్లు కనువిందు చేస్తుటుందీ తులిప్ గార్డెన్. దీనిని చూసేందుకు ప్రతి ఏటా లక్షల సంఖ్యలో పర్యాటకులు ఇక్కడికి విచ్చేస్తుంటారు. అయితే తాజాగా ఈ తులిప్ గార్డెన్ అరుదైన ఘనతను సాధించింది. 1.5 మిలియన్ల పూలతో శ్రీనగర్ (Srinagar) లోని తులిప్ గార్డెన్ ఆసియాలోనే అతిపెద్దదిగా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కింది. ఇక్కడి తులిప్ పూలు పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తాయి.

శ్రీనగర్ లోని ఇందిరా గాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ (Indira Gandhi Memorial Tulip Garden) ఆసియాలోనే అతిపెద్ద పార్కుగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్)లో చేరింది. ఉద్యానవనం 68 విభిన్న రకాలైన 1.5 మిలియన్ తులిప్ పూలతో ఆకట్టుకుంటోందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్విటర్ లో పేర్కొన్నారు. సుందరమైన ఉద్యానవనాన్ని లక్ష మంది సందర్శకులు సందర్శించారని కేంద్ర మంత్రి తెలిపారు.

Tulip Garden
Tulip Garden, Srinagar

తులిప్ తోట శ్రీనగర్ లోని దాల్ సరస్సు(Dal Lake), జబర్వాన్ కొండల (Zabarwan hills)మధ్య ఉంది. ఇది 30 హెక్టార్లలో విస్తరించి ఉంది. గతంలో సిరాజ్ బాగ్ అని పిలువబడే ఈ తోటలో హైసింత్స్, డాఫోడిల్స్, మస్కారి, సైక్లామెన్స్ వంటి ఇతర పుష్పాలు ఉన్నాయి.

శ్రీనగర్ టూరిజం ప్రకారం, కాశ్మీర్ లోయలో పూల పెంపకం , తోపాటు పర్యాటకాన్ని పెంచే లక్ష్యంతో ఈ పార్క్ ను 2007లో ప్రారంభించబడింది. ఇది ఏడు టెర్రస్ లతో ఏటవాలు నేలపై ఈ గార్డెన్ ఉంది. జమ్మూ కాశ్మీర్ లో తులిప్ పండుగను ఏటా నిర్వహిస్తుంది. అలాగే ప్రతి సంవత్సరం వసంత రుతువు ప్రారంభంలో తులిప్ ఫెస్టివల్‌ పేరుతో ఉత్సవాలను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..