
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో దూసుకుపోతున్న TVS Motor Company, తన పాపులర్ iQube సిరీస్‌కు కొత్త వేరియంట్‌ను జోడించింది. తాజా లాంచ్‌లో భాగంగా, బేస్ ట్రిమ్‌కి 3.1 kWh బ్యాటరీ ఎంపికను పరిచయం చేసింది. దీని ధర రూ. 1.05 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది ఇప్పటి వరకూ ఉన్న బేస్ మోడల్ కంటే రూ. 12,000 ఖరీదైనది కాగా, టాప్ వేరియంట్ iQube ST కంటే రూ. 21,000 చవకగా లభిస్తుంది.
TVS iQube 3.1: కొత్తవేరియంట్ లో ఏముంది?
ఈ తాజా విడుదలతో, iQube ఇప్పుడు మొత్తం ఆరు వేరియంట్లలో నాలుగు బ్యాటరీ ఆప్షన్స్ లలో అందుబాటులో ఉంది. కొత్త iQube 3.1 పెర్ల్ వైట్, వాల్నట్ బ్రౌన్, టైటానియం గ్రే, కాపర్ బ్రౌన్-బీజ్, స్టార్‌లైట్ బ్లూ-బీజ్ సహా ఐదు రంగు ఎంపికలలో అందుబాటులో ఉంది. ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని ఇతర ఫీచర్ హైలైట్‌లలో 32-లీటర్ అండర్ సీట్ స్టోరేజ్, బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన కలర్ TFT ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, USB ఛార్జింగ్ పోర్ట్‌లు, పిలియన్ బ్యాక్‌రెస్ట్ ఉన్నాయి.
iQube 3.1 యొక్క అతిపెద్ద హైలైట్ కొత్త 3.1 kWh బ్యాటరీ ప్యాక్, ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 123 కి.మీ.ల రేంజ్ ను ఇస్తుంది. ఈ వేరియంట్ ఛార్జింగ్ సమయం 2.2kWh కి సమానంగా ఉంటుంది, ఇది 0 నుండి 80 శాతం ఛార్జింగ్ కోసం 2 గంటల 45 నిమిషాలు ఉంటుంది. ఆసక్తికరంగా, ఈ వేరియంట్ యొక్క టాప్ స్పీడ్ టాప్-స్పెక్ iQube ST కి సమానంగా ఉంటుంది. ఇది గంటకు 82 కి.మీ.
TVS iQube 3.1 kWh వేరియంట్ వివరాలు
విభాగం | వివరాలు |
---|---|
ఒక్కసారి ఛార్జ్‌తో | 3.1 kWh |
ధర (ఎక్స్-షోరూమ్) | ₹1.05 లక్షలు |
ఒక్కసారి ఛార్జ్‌తో రేంజ్ | 123 కిలోమీటర్లు |
ఛార్జింగ్ సమయం (0-80%) | 2 గంటలు 45 నిమిషాలు |
టాప్ స్పీడ్ | 82 కిమీ/గం |
బరువు | 117 కిలోలు |
ఫ్రేమ్ | ట్యూబులర్ ఫ్రేమ్ |
సస్పెన్షన్ (ముందు) | టెలిస్కోపిక్ ఫోర్క్ |
సస్పెన్షన్ (వెనుక) | ట్విన్-ట్యూబ్ షాక్ అబ్జార్బర్ |
బ్రేకులు (ముందు) | 220mm డిస్క్ |
బ్రేకులు (వెనుక) | 130mm డ్రమ్ |
స్టోరేజ్ స్పేస్ | 32 లీటర్ల అండర్‌సీట్ స్టోరేజ్ |
ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ | కలర్ TFT స్క్రీన్ (బ్లూటూత్‌తో) |
యూజర్ ఫీచర్లు | USB ఛార్జింగ్, పిలియన్ బ్యాక్‌రెస్ట్ |
రంగుల ఎంపికలు | పెర్ల్ వైట్, వాల్నట్ బ్రౌన్, టైటానియం గ్రే, కాపర్ బ్రౌన్-బీజ్, స్టార్‌లైట్ బ్లూ-బీజ్ |
మొత్తం iQube వేరియంట్లు | 6 |
మొత్తం బ్యాటరీ ఆప్షన్స్.. | 4 |
ఇక డిజైన్ విషయానికొస్తే.. iQube దాని గత మోడల్స్ తో సమానంగా ఉంటుంది. ఇది ట్యూబులర్ ఫ్రేమ్‌తో అండర్‌పిన్ చేయబడింది. వెనుక భాగంలో ట్విన్-ట్యూబ్ షాక్ అబ్జార్బర్‌లతో పాటు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్‌లను కలిగి ఉంటుంది. బ్రేకింగ్ విధులను ముందు భాగంలో 220mm డిస్క్, వెనుక భాగంలో 130mm డ్రమ్ నిర్వహిస్తాయి. ఎలక్ట్రిక్ స్కూటర్ 117 కిలోల బరువును కలిగి ఉంటుంది.