Ultraviolette F77 Viral Video | ఆటో మొబైల్ రంగంలో సంప్రదాయ పెట్రోల్ వాహనాలకు దీటుగా శక్తివంతమైన ఎలక్ట్రిక్ బైక్ లు కూడా వస్తున్నాయి. తాజాగా అల్ట్రావయోలెట్ F77 ఎలక్ట్రిక్ బైక్.. 15,000 కిలోల బరువు ఉన్న ట్రక్కును, బస్సును ఒకేసారి లాగుతున్నట్లు కనిపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Viral Video లో కనిపించిన అల్ట్రావయోలెట్ F77 ఎలక్ట్రిక్ బైక్.. రీకాన్ వేరియంట్ ఇది 95 Nm పీక్ టార్క్‌తో పాటు 39hp గరిష్ట పవర్ అవుట్‌పుట్‌ను ఇస్తుంది. ఒకదాని వెనుక ఒకటి కట్టివేసిన రెండు భారీ వాహనాలను బైక్ అప్రయత్నంగా లాగింది. ఇంటర్నెట్‌లో ఈ వీడియోను చూసి ప్రతి ఒక్కరూ ఈ బైక్ పనితీరును చూసి ఆశ్చర్యపోయారు.
ఇదిలా ఉండగా Ultraviolette F99 ఇ-మోటార్‌సైకిల్‌ను అల్ట్రావయోలెట్ ఇటీవలే విడుదల చేసింది. ఇప్పటి వరకు భారతదేశంలో విడుదలైన అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఇదే.. ఇటీవల ఈ బైక్‌ను మిలన్‌లోని EICMA 2023లో ప్రదర్శించారు. ఇది శక్తివంతమైన 120-హార్స్పవర్ ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది. ఇది గరిష్టంగా 265 kmph వేగాన్ని అందుకోగలదు! Ultraviolette సమాచారం ప్రకారం, F99 2025లో ప్రపంచవ్యాప్తంగా విక్రయించబడుతుంది.
View this post on Instagram
Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.