Harithamithra Telugu News

Home EV Updates Viral Video | ఒకేసారి 15,000 కిలోల ట్రక్కు, బస్సును లాగిన ఎలక్ట్రిక్ బైక్..

Viral Video | ఒకేసారి 15,000 కిలోల ట్రక్కు, బస్సును లాగిన ఎలక్ట్రిక్ బైక్..

0
ultraviolette f77 viral video

Ultraviolette F77  Viral Video | ఆటో మొబైల్ రంగంలో సంప్రదాయ పెట్రోల్  వాహనాలకు దీటుగా శక్తివంతమైన ఎలక్ట్రిక్ బైక్ లు కూడా వస్తున్నాయి. తాజాగా అల్ట్రావయోలెట్ F77 ఎలక్ట్రిక్ బైక్..  15,000 కిలోల బరువు ఉన్న ట్రక్కును,  బస్సును ఒకేసారి లాగుతున్నట్లు కనిపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Viral Video లో కనిపించిన  అల్ట్రావయోలెట్ F77 ఎలక్ట్రిక్ బైక్..  రీకాన్ వేరియంట్ ఇది 95 Nm పీక్ టార్క్‌తో పాటు 39hp గరిష్ట పవర్ అవుట్‌పుట్‌ను ఇస్తుంది. ఒకదాని వెనుక ఒకటి కట్టివేసిన రెండు భారీ వాహనాలను బైక్ అప్రయత్నంగా లాగింది. ఇంటర్నెట్‌లో ఈ వీడియోను చూసి ప్రతి ఒక్కరూ ఈ బైక్ పనితీరును చూసి ఆశ్చర్యపోయారు.

ఇదిలా ఉండగా Ultraviolette F99 ఇ-మోటార్‌సైకిల్‌ను అల్ట్రావయోలెట్ ఇటీవలే విడుదల చేసింది. ఇప్పటి వరకు భారతదేశంలో విడుదలైన అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఇదే.. ఇటీవల ఈ బైక్‌ను మిలన్‌లోని EICMA 2023లో ప్రదర్శించారు. ఇది శక్తివంతమైన 120-హార్స్పవర్ ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంది. ఇది గరిష్టంగా 265 kmph వేగాన్ని అందుకోగలదు! Ultraviolette సమాచారం ప్రకారం, F99 2025లో ప్రపంచవ్యాప్తంగా విక్రయించబడుతుంది.

 

View this post on Instagram

 

A post shared by Narayan (@narayan_uv)

Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు,  జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్  అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి   ట్విట్టర్, ఫేస్ బుక్  లోనూ సంప్రదించవచ్చు.

Previous articleKia | దేశవ్యాప్తంగా 1000+ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన కియా.. K-Charge తో ఈజీగా..
Next articleటాప్ బ్రాండ్స్.. చేతక్ అర్బేన్, ఓలా S1 ఎయిర్, ఏథర్ 450s ఎలక్ట్రిక్ స్కూటర్ల స్పెక్స్.. ధరలు ఇవే..
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here