Vida Advantage Package

Vida Advantage Package | హీరో విడా కొనుగోలుదారులకు శుభవార్త.. కొత్త ప్యాకేజీతో అనేక ప్రయోజనాలు

Spread the love

Vida Advantage Package | ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త.. హీరో మోటోకార్ప్ తన VIDA V1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ పై ఇప్పుడు బ్రహ్మాండమైన ఆఫర్ ను తీసుకొచ్చింది.  కొనుగోలుదారులను ఆకర్షించేందుకు  కొత్తగా  Vida అడ్వాంటేజ్ ప్యాకేజీని విడుదల చేసింది. ఈ  ప్యాకేజీ EV వినియోగదారులకు  ఇబ్బంది లేకుండా చేస్తుంది.  ఇది 5 సంవత్సరాలలో చెల్లుబాటు అయ్యే రూ. 27,000 విలువైన ప్రయోజనాలు, సర్వీస్ ను అందించనుంది.   ఏప్రిల్ 31, 2024 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది.

Vida Advantage Package : ప్రయోజనాలు

Vida Advantage Package లో భాగంగా Vida Electric Scooter లోని  రెండు బ్యాటరీ ప్యాక్ లకు  సుమారు 5 సంవత్సరాలు లేదా 60,000 కిమీల ఎక్స్ టెండెడ్  బ్యాటరీ వారంటీని అందిస్తాయి.  అలాగే 2,000 కంటే ఎక్కువ ఛార్జింగ్ పాయింట్లతో బ్రాండ్  ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ కు యజమానులు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు.  ఇది బ్రాండ్  సర్వీస్ సెంటర్లలో  ఐదేళ్ల పాటు EVల కోసం ఉచిత సర్వీస్ లను పొందవచ్చు.  అంతేకాకుండా, యజమానులు 24×7 రోడ్ సైడ్ అసిస్టెంట్ ను కూడా పొందవచ్చు.

Extended Warranty:  కస్టమర్‌లు తమ Vida V1 ప్రోపై ఎక్స్ టెండెడ్  వారంటీని అందుకుంటారు. ఇది ప్రామాణిక వారంటీ వ్యవధి కంటే ఎక్కువ కవరేజీని అందజేస్తుంది. ఇది వినియోగదారులకు బ్యాటరీపై టెన్షన్ ను తొలగిస్తుంది.

Free Maintenance: ప్యాకేజీలో నిర్దిష్ట కాలానికి ఉచిత లేదా రాయితీతో కూడిన మేయింటెనెన్స్ సర్వీస్ లు  ఉంటాయి. ఇది వినియోగదారుల ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది.  స్కూటర్ చక్కగా నిర్వహించుకునేందుకు ఉపయోగపడుతుంది.
Roadside Assistance: Vida అడ్వాంటేజ్ ప్యాకేజీలో భాగంగా హీరో 24/7 రోడ్‌సైడ్ సహాయాన్ని అందించవచ్చు. ఇది బ్రేక్‌డౌన్‌లు లేదా అత్యవసర పరిస్థితుల్లో సహాయాన్ని అందిస్తారు. వినియోగదారులకు చక్కని భద్రతను  అందిస్తుంది.
Battery Support:  దీనికి సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. అయితే ప్రోగ్రామ్‌లో బ్యాటరీకి సంబంధించిన ప్రయోజనాలు, వారంటీ పొడిగింపులు లేదా సమస్యల విషయంలో వేగవంతమైన పరిష్కారాలు అందించవచ్చు.
Vehicle Tracking: ఈ ప్యాకేజీ కింద Vida V1 ప్రో కోసం హీరో అంతర్నిర్మిత లేదా కాంప్లిమెంటరీ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్‌ను అందించవచ్చు. ఇది రియల్ టైమ్ లొకేషన్ ట్రాకింగ్,  దొంగతనాల నివారణకు ఉపయోగపడుతుంది.

అలాగే  My Vida అనే మొబైల్ యాప్‌లో సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు కస్టమర్‌లు తమ వాహనం పనితీరు,  భద్రతపై ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.  నియంత్రణ కోసం ఈ యాప్ ద్వారా అనేక కనెక్టివిటీ లతోపాటు సెక్యూరిటీ  ఫీచర్‌లకు యాక్సెస్‌ చేయడంతో పాటుయాప్ సాయంతో  V1 ప్రోని అన్‌లాక్ చేయవచ్చు.

Vida V1 Plus ఎలక్ట్రిక్ స్కూటర్ రూ. 97,800 (ఎక్స్-షోరూమ్), V1 ప్రో మోడల్ ధర రూ. 1.26 లక్షలు (ఎక్స్-షోరూమ్). V1 ప్రో కేవలం 3.2 సెకన్లలో 0-40 kmph వేగాన్ని అందుకోగలదు.  గరిష్ట వేగం 80kmph. ఒక్కసారి ఛార్జ్ చేస్తే, ఇ-స్కూటర్  110 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. కాగా ప్రస్తుతం ఈవీ మార్కెట్ లో Vida V1 కి పోటీగా, Ather 450X, Ola S1 Pro, Bajaj Chetak, TVS iQube వంటి టాప్ బ్రాండ్ స్కూటర్లు గట్టిపోటీనిస్తున్నాయి.


Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి.  అలాగే  న్యూస్  అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి   ట్విట్టర్,  ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.

More From Author

World Forest Day International Day of Forests

International Day of Forests | ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఇలా జరుపుకోండి..

Srinagar Tulip Garden Opend

Srinagar Tulip Garden | ఆసియాలోనే అతి పెద్దదైన తులిప్ గార్డెన్.. ప్రజల కోసం తెరిచిన అధికారులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *