న్యూఢిల్లీ: భారతదేశం అతిపెద్ద సోలార్ మాడ్యూల్ తయారీదారులలో ఒకటిగా అవతరిస్తోందని, పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని వేగంగా పెంచుకుంటూ పోతోందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కె సింగ్ మంగళవారం తెలిపారు. భారతదేశం ఇప్పటికే గణనీయమైన సౌర విద్యుత్ ఉత్పాదక సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు.
“బలమైన పర్యావరణ వ్యవస్థను పెంపొందించే గ్రీన్ హైడ్రోజన్‌తో సహా పునరుత్పాదక శక్తిలో భారతదేశం ప్రపంచ పవర్‌హౌస్‌గా మారడానికి సిద్ధంగా ఉంది. పవన శక్తిలో అతిపెద్ద ఉత్పాదక పర్యావరణ వ్యవస్థలలో ఒకటి. సౌరశక్తి అభివృద్ధి విషయంలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది” అని ఢిల్లీలో జరిగిన ICRA కార్యక్రమంలో మాట్లాడుతూ సింగ్ అన్నారు.
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఒకటి అని, అయినప్పటికీ దేశంలో గ్రీన్‌హౌస్ వాయువుల తలసరి ఉద్గారాలు ప్రపంచ సగటు కంటే తక్కువగా ఉన్నాయని అన్నారు.
పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడం, కర్బన ఉద్గారాలను తగ్గించడం మధ్య చక్కటి సమతుల్యతను సాధించేందుకు దేశం ప్రయత్నిస్తోందని, సుస్థిర వృద్ధి, పునరుత్పాదక ఇంధన విస్తరణ, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై చిత్తశుద్ధితో కృషి చేస్తోందని తెలిపారు.
“పర్యావరణ స్పృహతో ఆర్థిక వృద్ధిని వ్యూహాత్మకంగా సమతుల్యం చేయడం ద్వారా, దేశం రాబోయే తరాలకు ఉజ్వలమైన, హరతయుత భవిష్యత్తును అందించాలని నిర్ణయించుకుంది” అని ఆయన అన్నారు.