Friday, November 22Lend a hand to save the Planet
Shadow

నేటి నుంచి India EV Expo 2022

Spread the love

India EV Expo 2022 : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ గత దశాబ్దంలో చాలా గణనీయంగా పెరిగింది. ఈవీల‌పై అవ‌గాహన పెంచేందుకు ప్ర‌భుత్వం కూడా చ‌ర్య‌లు తీసుకుంటోంది. అయితే ఎల‌క్ట్రిక్ వాహ‌నాల గురించి తెలుసుకోవాల‌నుకునేవారి కోసం ఒక శుభవార్త ఉంది.. 2022 ఆగ‌స్టు 05 నుంచి 15th Electric Vehicle Technology Expo’s 2022 (15వ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ ఎక్స్‌పో 2022 ) ప్రారంభం కానుంది. ఇది న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఆగస్ట్ 5న ప్రారంభమై ఆగస్టు 7న ముగియ‌నుంది.

15వ EV ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ కార్ సెక్టార్‌లో పాల్గొనేవారు తమ ఉత్ప‌త్తుల‌ను ప్రదర్శించడానికి, ఇంట్రొడ్యూస్ చేయడానికి అవకాశం కల్పిస్తారు. ఇది అతిపెద్ద యానివ‌ల్ ప్రోగ్రాం. ఇలాంటివి వివిధ ప్రదేశాలలో సంవత్సరానికి రెండుసార్లు జరుగుతాయి. EV ఇండియా 2022 ఎక్స్‌పో అనేది అంతర్జాతీయ ఎలక్ట్రిక్ మోటారు వాహనాల ప్రదర్శన. ఇది ప్ర‌ముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులకు వారి సరికొత్త ఉత్పత్తులు, సాంకేతిక పురోగతులు, నెక్ట్స్ జెన‌రేష‌న్ ఉత్ప‌త్తులు, ఎలక్ట్రిక్ ప్యాసింజర్ కార్లు, స్కూటర్లు, మోటార్ సైకిళ్లు, బస్సులను ప్రదర్శించే అవకాశాన్ని కల్పిస్తుంది.

India EV Expo 2022 ద్వారా కొత్త వ్యాపారాన్ని సృష్టించడం, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యాలు.. ఎక్స్‌పో అనేది భారతదేశంలోని వినియోగదారులు, వ్యాపారాల కోసం జ్ఞానాన్ని మార్పిడి చేయడానికి, ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి, బ్రాండ్‌లను ప్రదర్శించడానికి అత్యుత్తమ పబ్లిక్ ఇంటరాక్టివ్ ఫోరం గా ఉంటుంది. ఈ సంవత్సరం ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ బైక్‌లు, సైకిళ్లు, స్కూటర్లు, రిక్షాలు, కార్ట్‌లు, మరిన్నింటితో సహా 100 మంది భారతీయ, విదేశీ ఎగ్జిబిటర్లు తమ వస్తువులు, సేవలను ప్రదర్శిస్తారు. “India’s EV Sector: Roadmap for Global Leadership.” (ఇండియాస్ EV సెక్టార్: గ్లోబల్ లీడర్‌షిప్ ఫ‌ర్ రోడ్‌మ్యాప్‌) అనే పేరుతో ఆగస్టు 4వ తేదీన జరిగే ఒక-రోజు సెమినార్ తర్వాత ఇది జరుగుతుంది.

cmovie

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *