Home » హీరో ఎల‌క్ట్రిక్ మ‌ళ్లీ ముందంజ‌
hero electric ola, ather

హీరో ఎల‌క్ట్రిక్ మ‌ళ్లీ ముందంజ‌

Spread the love
  • జూలై EV విక్రయాల టాప్

  • ఏథర్, ఓలా వెనుకబాటు

ప్ర‌ఖ్యాత ఈవీ త‌యారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ (Hero Electric).. జూలై నెలలో ద్విచక్ర వాహన విక్రయాలలో తిరిగి అగ్రస్థానాన్ని పొందింది. మ‌రోవైపు ఏథర్, ఓలా గణనీయమైన తగ్గుదలని న‌మోదు చేసుకున్నాయి.   మొత్తం మీద‌ Electric vehicles మార్కెట్ గ‌త నెల ఊపందుకుంటోంది.  భారతదేశం అంతటా మొత్తం అమ్మకాలు రెండు రెట్లు పెరిగిన‌ట్లు గ‌ణంకాలు వెల్ల‌డిస్తున్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

  • జూలై లో టూ-వీలర్ EV విక్రయాలు టాప్ 10 తయారీదారుల్లో Hero Electric దాని టాప్ పొషిజ‌న్‌ను తిరిగి పొందగా, Ather Ola బ‌డా సంస్థ‌లు తమ విక్రయాల జాబితాలో గణనీయమైన తగ్గుదలని న‌మోదు చేసుకున్నాయి.
  • హీరో ఎలక్ట్రిక్ Hero Electric గత కొన్ని నెలలుగా అమ్మకాలలో క్షీణత తర్వాత జూలైలో య‌థాస్థానాన్నితిరిగి పొందింది. కొన్ని నెల‌ల క్రితం ఇది మూడవ స్థానానికి దిగజారింది. జూన్‌లో 6,504 EVలతో పోలిస్తే జూలైలో దీని మొత్తం విక్రయాలు 8,786 యూనిట్లుగా ఉన్నాయి. ఇది నెలవారీగా 35 శాతం పెరిగింది.
  • ఒకినావా (Okinawa AutoTech): ఇటీవలి నెలల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఓకినావా ఆటోటెక్.. జూన్ 6,944 యూనిట్ల అమ్మకాల నుండి 17 శాతం వృద్ధితో 8,093 యూనిట్లతో రెండో స్థానానికి పడిపోయింది.
  • ఆంపియర్(Ampear): దక్షిణాదికి చెందిన Electric vehicles తయారీ సంస్థ ఆంపియ‌ర్ మూడవ స్థానంలో నిలిచింది.  జూలై విక్రయాలలో కొంత మందగమనాన్ని చూసింది. జూన్‌లో 6,541 EVలను విక్ర‌య‌గించ‌గా జూలైలో 4 శాతం తగ్గి 6,312 యూనిట్లను విక్ర‌యించింది.
  • TVS మోటార్స్ (TVS Motors): ఇక ప్ర‌ఖ్యాత ఆటోమొబైల్ దిగ్గ‌జం TVS మోటార్స్ గేమ్ చేంజ్ చేసింది.  జూలైలో 4,244 యూనిట్లను విక్రయించి గ‌ణ‌నీయ‌మైన స్థానానికి చేరుకుంది. , జూన్‌లో ఏడవ స్థానం నుండి 1,946 యూనిట్లతో నాల్గవ స్థానానికి ఎగ‌బాకింది.
READ MORE  Bharat NCAP : మహీంద్రా XEV 9e వేరియంట్ కు 5-స్టార్ రేటింగ్

 

  • ఓలా ఎల‌క్ట్రిక్ (Ola Electric) : ఓలా ఎలక్ట్రిక్‌కు సవాళ్లు త‌ప్ప‌డం లేదు. అమ్మకాలలో స్థిరమైన తగ్గుదలను న‌మోదు చేసుకుంటోంది. జూలైలో ఇది 3,852 యూనిట్లను విక్రయించింది, జూన్‌లో విక్రయించిన 5,886 యూనిట్లు అమ్మ‌గా ఈసారి బాగా త‌గ్గింది. ఏప్రిల్‌లో అత్యధికంగా 12,702 యూనిట్ల తర్వాత ఇటీవలి నెలల్లో ఈ ఓలా స్కూట‌ర్లు అగ్నిప్ర‌మాదాల‌కు గురికావ‌డంతో వీటి మార్కెట్‌పై తీవ్ర‌మైన ప్ర‌భావం పడింద‌నిమార్కెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఓలా ఐదో స్థానానికి ప‌రిమిత‌మైంది.
  • ఏథర్ ఎనర్జీ (Ather Energy): టాప్ 10 జాబితాలో మరొక ముఖ్యమైన ఈవీ ప్లేయ‌ర్ అయిన ఏథ‌ర్ ఎన‌ర్జీ కూడా వెనుకబడిపోయింది. జూన్‌లో 3,829 యూనిట్లు విక్ర‌యించ‌గా జూలై అమ్మకాలు 1,279 యూనిట్లకు తగ్గాయి.
READ MORE  హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ స్పెసిఫికేషన్లు ఇవే..

 

  • Revot : రివోల్ట్ కూడా జూన్‌లో 2,424 యూనిట్ల నుండి జూలై అమ్మకాల్లో 2,316 ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు స్వల్పంగా క్షీణించింది.
  • బ‌జాజ్ ఎలక్ట్రిక్ (Bajaj Auto): జూన్‌లో 1,798 EVల నుండి జూలైలో 2,418 యూనిట్లకు నెలవారీ విక్రయాల పరంగా బజాజ్ ఆటో చాలా మెరుగుపడింది.

ఈవీ మార్కెట్‌లో కంపెనీల వ్య‌క్తిగ‌త‌ప‌రంగా లాభపడినవారు, నష్టపోయినవారు ఉన్నప్పటికీ. . మొత్తం Electric vehicles విభాగం మాత్రం దేశంలో ఊపందుకుంది. సంవత్సరానికి పోల్చితే, మొత్తం అమ్మకాల సంఖ్య రెండు వందల శాతం పెరిగి 44,259 యూనిట్లకు చేరుకుంది. నెలవారీగా చూస్తే. జూన్‌లో విక్రయించిన 41,837 EVలను విక్ర‌యించ‌గా 6 శాతం లాభాన్ని చూపుతుంది.

READ MORE  హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ స్పెసిఫికేషన్లు ఇవే..

Hero Electric Ola ather News

One thought on “హీరో ఎల‌క్ట్రిక్ మ‌ళ్లీ ముందంజ‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
Hyundai Creta Electric Specifications detials ఈ ప్రాణాంతకమైన మొక్కలకు దూరంగా ఉండడండి..
Hyundai Creta Electric Specifications detials ఈ ప్రాణాంతకమైన మొక్కలకు దూరంగా ఉండడండి..