కొత్త ఫీచర్లు, పెరిగిన రేంజ్‌తో 2022 Ather 450X వచ్చేసింది
Ather Energy భారతదేశంలో Ather 450X మోడల్‌లో Gen 3 వెర్షన్‌ను విడుదల చేసింది. 2022 Ather 450X ధర రూ.1.39 (ఢిల్లీ ఎక్స్‌షోరూం) లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అంటే అంతకు ముందు వచ్చిన మోడల్ కంటే కేవలం రూ. 1,000 మాత్రమే ఎక్కువ. బెంగళూరులో కొత్త ఏథర్ 450X ఎక్స్-షోరూమ్ రూ. 1.55 లక్షలు.
కొత్త 2022 ఏథర్ 450X లో మెరుగైన రైడింగ్ రేంజ్, కొత్త ఫీచర్లను అందజేస్తున్నారు. బయటి రూపంలో మార్పులు కనిపించవు. ఇది కూడా వైట్, స్పేస్ గ్రే, మింట్ గ్రీన్ కలర్ షేడ్స్‌లో అందించబడుతుంది. Ather Energy 450X యొక్క పవర్‌ట్రెయిన్‌ను అప్‌డేట్ చేసింది. ఇది ఇప్పుడు మునుపటి కంటే పెద్ద బ్యాటరీని కలిగి ఉంటుంది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇప్పుడు గతంతో వచ్చిన మోడల్‌లోని 2.9kWh యూనిట్‌కు బదులుగా ఇందులో 3.7kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. అనువైన పరిస్థితులలో సింగిల్ ఛార్జ్‌కి 106 కిమీ బదులుగా 146 కిలోమీటర్లకు పెరిగింది.
100 నగరాల్లోని 150 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లకు..
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లోని ఇతర అప్‌డేట్‌లలో 7.0-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, UI, MRF, కొత్త 12-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లను గమనించవచ్చు. Ather 450Xతో టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, కొత్త ఫుట్‌స్టెప్ మొదలైన వాటితో సహా మరెన్నో ఫీచర్లను జత చేశారు. కంపెనీ తన రిటైల్ ఫుట్‌ప్రింట్‌ను 41 రిటైల్ స్టోర్‌లతో 36 నగరాలకు విస్తరించింది. 2023 వరకు 100 నగరాల్లోని 150 ఎక్స్‌పీరియన్స్ సెంటర్లకు విస్తరించాలని యోచిస్తోంది. .
థర్డ్ జనరేషన్ 450X విడుదలపై ఏథర్ ఎనర్జీ సహ వ్యవస్థాపకుడు, CEO తరుణ్ మెహతా మాట్లాడుతూ దేశంలో “Ather 450 E2W విభాగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది 2020లో ప్రారంభించబడిన 450X Gen 2, EVలను భారతీయ మార్కెట్‌కు నూతనోత్తేజనం తీసకొచ్చిది. దాని నమ్మకమైన పనితీరు, విశ్వసనీయతతో బెంచ్‌మార్క్‌ను సెట్ చేసిందని తెలిపారు.
“450X Gen 3తో, తాము పనితీరును రెట్టింపు చేశాము. అలాగే థ్రిల్లింగ్ అనుభవాన్ని అందించడానికి మరో స్థాయికి తీసుకువెళ్ళాము. Gen 3 మోడల్ పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో కూడా వస్తుంది. ఇది 146 కిమీల సర్టిఫైడ్ రేంజ్‌ను, TrueRangeTM 105 కిమీలను అందిస్తుంది. ఇది ఉత్తేజకరమైన ఇంకా నమ్మదగిన, స్థిరంగా పనిచేసే ఎలక్ట్రిక్ స్కూటర్‌ల కోసం వెతుకుతున్న వినియోగదారులకు ఇది సరిగ్గా సరిపోతుందని తెలిపారు. 450X Gen 3 అనేది దేశంలో E2W సెగ్మెంట్‌ను వృద్ధి చేయడంలో, E2Wని నిజంగా ప్రధాన స్రవంతిలోకి తీసుకోవడంలో కీలకంగా ఉంటుందని తరుణ్ మెహతా పేర్కొన్నారు.
[…] Vehicles (EV) లను వేగంగా స్వీకరించడం కోసం, Ather కంపెనీ ఈ ఏడాది అదనంగా 911 పబ్లిక్ […]