రేపే 3వ జనరేషన్ ఏథర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్
అధికారికంగా ప్రకటించిన ఏథర్ ఎనర్జీ
3rd-generation Ather 450X : ఈవీ మార్కెట్‌లో విజయపథంలో దూసుకుపోతున్న Ather Energy కంపెనీ తన Ather 450X థర్డ్ జనరేషన్ మోడల్‌ను
మంగళవారం విడుదల చేస్తోంది. Ather 450లో 3.66 kWh పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుత Ather 450X లో 2.8 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది సింగిల్ చార్జిపై 75-80 కి.మీ రేంజ్ ఇస్తుంది. కొత్తగా వస్తున్న స్కూటర్‌లో 146 కి.మీ (క్లెయిమ్ చేయబడిన రేంజ్) వరకు రేంజ్‌ను ఇస్తుందని సమాచారం.
కొత్త బ్యాటరీ బరువు 19 కిలోలు. దీనిని నికెల్ కోబాల్ట్ తో తయారు చేశారు. అయితే ఇదే అదే బ్యాటరీని థర్డ్ జన్ 450 యొక్క తక్కువ వేరియంట్‌కి కూడా అమర్చనున్నారు. అయితే తక్కువ వేరియంట్‌లలో సాఫ్ట్‌వేర్ ద్వారా క్లెయిమ్ చేసిన పరిధిని 108 కి.మీ.లకు లాక్ చేయాలని భావిస్తున్నారు. కొత్త బ్యాటరీ కారణంగా ఏథర్ స్కూటర్‌ను కొద్దిగా రీడిజైనింగ్ చేయాల్సలి వచ్చింది. ఇది పొడవైన వీల్‌బేస్ కలిగి ఉంటుందని, కాస్త ఎక్కువ బరువును కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
3rd-generation Ather 450X అత్యాధునిక ఫీచర్లు
Ather 450X లో రైడింగ్ మోడ్‌లు – వార్ప్, స్పోర్ట్, రైడ్, ఎకో అలాగే స్మార్ట్ ఎకో మోడ్లు ఉంటాయని తెలుస్తోంది. కొత్త స్కూటర్ యొక్క పీక్ పవర్ 6.4 kWగా ఉండనుంది. అయితే నామమాత్రపు పవర్ అవుట్‌పుట్ 3.1గా ఉంది. వార్ప్ మోడ్ కోసం kW.
ఏథర్‌కు పోటీగా ఓలా , టీవీఎస్
ప్రస్తుతం విక్రయిస్తున్న ఏథర్ 450 ప్లస్ ధర రూ. బెంగళూరులో 1.58 లక్షలు (ఆన్-రోడ్) అయితే కొత్త 450X ధర రూ. 1.81 లక్షలు ఉండనుంది. ప్రస్తుతం మార్కట్‌లో ఓలా ఎలక్ట్రిక్ తన S1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ 1.35 లక్షలకు అందుబాటులో ఉంది. ఇది 181 కిమీల రేంజ్, అధిక పవర్ మోటార్‌ను కలిగి ఉంది. అలాగే 135 రేంజ్ కలిగిన TVS iQube ST, టాప్-ఎండ్ ST ట్రిమ్ వేరియంట్ 1.8 లక్షలకు అందుబాటులో ఉంది. పెద్ద బ్యాటరీ, పెరిగిన పవర్ అవుట్‌పుట్‌తో వస్తున్న థర్డ్ జనరేషన్ Ather 450 గతంలో వచ్చిన రెండు మోడల్స్ దుర్కొన్న అతిపెద్ద సవాళ్లలో ఒకదాన్ని అధిగమించింది. అoదులో మొదటిది రేంజ్ పరిధి.
Nice