Friday, November 22Lend a hand to save the Planet
Shadow

ఇండియన్ హై స్పీడ్ e-bike Nahak P-14

Spread the love

గంటకు 135కి.మి వేగం

ఎలక్ట్రిక్ ద్విచ‌క్ర వాహనాల తయారీ సంస్థ Nahak Motors (నహక్ మోటార్స్ ) భారతీయ మార్కెట్‌లో ఓ హై-స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేస్తోంది. ఇది పెట్రోల్ స్పోర్ట్స్ బైక్ త‌ర‌హాలో కనిపించే Nahaq P-14  హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ ను కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది.  ఇందుకోసం Nahaq  P-14  ఈ-బైక్ కోసం కంపెనీ బుకింగ్‌లను కూడా ప్రారంభిస్తోంది.

నహక్ పి-14 (Nahak P-14) కోసం కంపెనీ ప్రీ-బుకింగ్‌ల‌ను మార్చి 15 నుంచి మార్చి 30 వరకు మాత్రమే ఓపెన్ చేయనుంది. ఈ ఏడాది మే నెలలో ఈ బైక్ డెలివరీలను ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది. మార్కెట్‌లో పి-14 ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ ధర రూ.2.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)  ఉంటుంది. ఆసక్తిగల కస్టమర్లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రూ.11,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి దీనిని బుకింగ్ చేసుకోవచ్చు.

మ‌రో మంచి విష‌య‌మేంటంటే.. ప్రీ బుకింగ్ వ్యవధిలో కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైక్ ఎమ్ఆర్‌పిపై 10 శాతం డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఈ ఇ-బైక్ ను ముందుగా బుక్ చేసుకునే వారు తక్కువ ధరకే దీనిని కొనుగోలు చేసే అవకాశ‌ముంటుది. ఆటో ఎక్స్‌పో 2020లో Nahak Motors తమ పి-14 ఎలక్ట్రిక్ బైక్‌ను మొద‌టిసారి ఆవిష్కరించారు. ఈ హైస్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ గరిష్టంగా గంటకు 135 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.

ఈ బైక్ పెర్ఫార్మెన్స్ విషయంలో ప్ర‌స్తుతం మార్కెట్‌లో ఉన్న పెట్రోల్ స్పోర్ట్స్ బైక్‌ల‌కు ఏమాత్రం తీసిపోదని చెప్ప‌వ‌చ్చు. ఎలక్ట్రిక్ టూవీలర్లలో ఇప్ప‌టివ‌ర‌కు ఇదే టాప్ స్పీడ్‌.
నహక్ పి-14 హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్‌ లో లిథియం అయాన్ బ్యాటరీని వినియోగించారు. ఈ బ్యాటరీని ఇంట్లోనే సాధార‌ణ ప్లగ్ సాయంతోనే ఛార్జ్ చేసుకోవచ్చు. సాధారణ ఛార్జర్‌ ని ఉపయోగించి ఈ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయడానికి కేవ‌లం 3 గంటల సమయం మాత్ర‌మే పడుతుంది.

నహక్ పి-14 హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచ‌ర్‌ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫాస్ట్ చార్జర్ సాయంతో ఈ హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీని కేవలం అర‌గంట‌లోనే ఫుల్‌గా ఛార్జ్ చేసుకోవచ్చు. గరిష్టంగా గంటకు 135 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ బైక్, భారతదేశపు మొట్టమొదటి హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ అని కంపెనీ వెల్ల‌డించింది. అలాగే ఈ బైక్‌లో 72v 60Ah లిథియం-అయాన్ బ్యాటరీని అమ‌ర్చారు.

ఫీచ‌ర్లు ఇవీ..

ఈ బైక్ లో ప్రధాన ఫీచర్లను ప‌రిశీలిస్తే.. ఇందులో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన స్ప్లిట్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, షార్ప్ బాడీ లైన్స్, ఫుల్ బాడీ ప్యానెల్స్, డిజిటల్ స్పీడోమీటర్, మిడ్-మౌంటెడ్ బీఎల్‌డీసీ ఎలక్ట్రిక్ మోటార్, ముందు వైపు డ్యూయెల్ డిస్క్, వెనుక వైపు సింగిల్ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. అలాగే ముందు వైపు అప్‌సైడ్ డౌన్ ఫోర్కులు, వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్ సెటప్, 150 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నాయి.

నహక్ గ్రూప్ చైర్మన్ ప్రవత్ నహక్ మాట్లాడుతూ.. “ప్రజలకు నాణ్యమైన ఎలక్ట్రిక్ బైక్‌ల ను అందించడమే తమ ల‌క్ష్య‌మ‌ని, స్మార్ట్ ఎలక్ట్రిక్ బైక్‌లలో ఇప్పటి వరకు స్పీడ్ గురించి ఎవరూ పట్టించుకోలేదని, అందుకే తాము న‌హ‌క్‌ పి-14తో ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్‌లో ఎదురులేని హై స్పీడ్‌ని తీసుకొస్తున్నామ‌ని వెల్ల‌డించారు.

తమ వెబ్‌సైట్ ద్వారా ఫ‌స్ట్ హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్ Nahak P-14 ప్రీ-బుకింగ్‌ లను ప్రారంభించామని, ఈ ఎలక్ట్రిక్ బైక్‌ను రూ.11 వేలతో బుక్ చేసుకోవచ్చని తెలిపారు. తాము ఆటో ఎక్స్‌పో 2020 సందర్భంగా  మొట్టమొదటి హై స్పీడ్ ఎలక్ట్రిక్ బైక్, Nahak P-14ని ప్రారంభించామని, COVID-19 కారణంగా అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఈ బైక్ ప్రారంభించబోతున్నామని పేర్కొన్నారు.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *