Home » Ola scooter ధర‌లు పెరుగుతున్నాయ్‌..

Ola scooter ధర‌లు పెరుగుతున్నాయ్‌..

ola elecric launch
Spread the love

ప్ర‌ముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) త‌న “ఓలా ఎస్1 ప్రో” (Ola S1 Pro ) ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్  ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. హోలీ రోజు ప్ర‌ముఖ ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాలపై డిస్కౌంట్లు, ఆఫ‌ర్లు ప్ర‌క‌టిస్తుంటే..  ఓలా మాత్రం ధరలను పెంచి కస్టమర్లకు గ‌ట్టి షాక్ ఇచ్చింది. 2022 మార్చి 18న చివరి వరకూ ఓలా ఎస్1 ప్రో స్కూటర్ ను కొనుగోలు చేసే కస్టమర్లు మాత్రమే పాత ధ‌ర రూ.1.29 లక్షలకు (ఎక్స్-షోరూమ్) కొనుగోలు చేయ‌వ‌చ్చు. తాజా సమాచారం ప్రకారం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు హోలీ మ‌రుస‌టి రోజు నుంచి పెరగనున్నాయి. హోలీ ప‌ర్వ‌దినం సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు కోసం 17, 18వ తేదీల్లో ప‌ర్చేజ్ విండోను తెరిచింది. ఆ వ్య‌వ‌ధిలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసేవారికి ఈ ధరల పెంపు వర్తించదు. అయితే ఈ కంపెనీ తదుపరిగా ఓపెన్ చేయబోయే ప‌ర్చేజ్ విండోలో వీటి ధరలను పెంచనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ తెలిపింది. ఈ ధ‌ర‌ల పెంపు విష‌యాన్ని ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవిష్ అగర్వాల్ ట్విట్ట‌ర్ వేదిక‌గా ధ్రువీకరించారు.

Ola scooter ధరలు సుమారు 3 నుండి 5 శాతం వ‌ర‌కు పెరిగే అవ‌కాశం ఉంది. కాగా, ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలను ఎంత మేర పెంచుతామనే విషయాన్ని మాత్రం కంపెనీ క‌చ్చితంగా వెల్లడించలేదు. మీడియా అంచనాల‌ ప్రకారం వీటి ధరలు సుమారు 3 నుండి 5 శాతం వరకూ పెరిగే అవకాశముంది. ఓలా ఇప్పటి వరకు తన ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ.1,29,999 ధరకు, ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ ను రూ.99,999 ధరకు విక్రయించింది. ఇకపై, కొత్త ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేయాలనుకునే వారు పెరిగిన ధరలు చెల్లించాల్సిందే..

Hero electric Optima hx

భవీష్ అగర్వాల్ ట్వీట్ సారాంశం ఇదీ..  “ఇప్పటికే ఎస్1 ప్రోని కొనుగోలు చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను రూ. 129,999 ధరకి పొందడానికి ఇదే చివరి అవకాశమ‌ని, తాము తదుపరి విండోలో ధరలను పెంచబోతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ విండో మార్చి 18 అర్ధ‌రాత్రి  ముగుస్తుందని, కాబ‌ట్టి  ఓలా యాప్‌లో ఇప్పుడే కొనండి అంటూ  ట్వీట్ చేశారు.

అందమైన గ్లోసీ ఫినిషింగ్‌లో ప్రత్యేకమైన స్పెషల్ ఎడిషన్ కలర్  ’గెరువా’ను కూడా తీసుకువస్తున్నట్లు ఓలా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ప్రస్తుత కొనుగోలు కోసం మొత్తం డిజిటల్ చెల్లింపు ప్రక్రియ ఓలా యాప్ ద్వారా మాత్రమే ఉంటుందని కంపెనీ తెలిపింది. Ola ఫ్యూచర్‌ఫ్యాక్టరీ నుంచి Ola S1 ప్రో కు సంబంధించిన ఈ కొత్త ఆర్డర్‌ల పంపిణీ ఏప్రిల్ 2022 నుంచి ప్రారంభమవుతుంది. ఈ వాహ‌న‌లు కస్టమర్‌ల ఇంటి వద్దకే డెలివరీ చేస్తారు.

ఓలా ఫ్యాక్ట‌రీ గురించి..

ప్రపంచంలోనే అతిపెద్ద టూవీట‌ర్ ఫ్యాక్టరీ అయిన ఓలా ఫ్యూచర్‌ఫ్యాక్టరీలో ఎల‌క్ట్రిక్ స్కూటర్ల‌ను త‌యారు చేస్తున్నారు. అధిక కస్టమర్ డిమాండ్‌ను తీర్చడానికి కంపెనీ ప్రస్తుతం Ola S1 ప్రో స్కూటర్ల ఉత్ప‌త్తిని పెంచుతోంది. ఫిబ్రవరిలో ఓలా ఎలక్ట్రిక్ దాదాపు 7,000 వాహనాలను డెలివరీ చేసింది. మార్చిలో 15,000 యూనిట్ల డెలివరీని చేయ‌నున్న‌టు్ల అగర్వాల్ గతంలో ప్రకటించారు. 12 నెలలుగా, ఓలా ఎలక్ట్రిక్ తమిళనాడులోని కృష్ణరాజపురం జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ కేంద్రమైన ఫ్యూచర్‌ఫ్యాక్టరీని నిర్మించిన విష‌యం తెలిసిందే.

ఓలా ఫ్యూచర్‌ఫ్యాక్టరీ, పూర్తి సామర్థ్యంతో 10,000 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద మహిళల‌ కర్మాగారంగా రికార్డుల‌కెక్కింది.


For tech news visit Techtelugu

2 thoughts on “Ola scooter ధర‌లు పెరుగుతున్నాయ్‌..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *