Kenetic Luna Electric|ఒక్కప్పుడు రోడ్లపై సందడి చేసిన కెనేటిక్ లూనా.. మనందరి మనస్సుల్లో చెరగని ముద్ర వేసింది. అయితే. ఇప్పుడు దీనికి సంభందించిన న్యూస్ అప్డేట్ వచ్చింది. ఈ లూనా మోపేడ్ మళ్ళీ ఎలక్ట్రిక్ వెర్షన్ లో త్వరలో మన ముందుకు వస్తోంది.
కొత్త సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎలక్ట్రిక్ లూనా (Kenetic Luna Electric ) మార్కెట్‌లోకి రానుంది. కైనెటిక్ గ్రీన్ వ్యవస్థాపకుడు సులజ్జా ఫిరోడియా మోత్వాని మీడియా కు వెల్లడించారు. ఇటీవల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం Zulu ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ.. “ఇది మొదటి త్రైమాసికంలో వస్తుందని పునరుద్ఘాటించారు. ఇది ఇప్పటికే అవసరమైన అన్ని ప్రభుత్వ ఆమోదాలను కలిగి ఉంది – అది FAME ఆమోదం కావచ్చు, రాష్ట్ర ఆమోదాలు కావచ్చు, మేము ఇతర ప్రదేశాలలో టెస్టింగ్ చేస్తున్నాము. మాకు చాలా మంచి స్పందన వచ్చింది. అని తెలిపారు..
1980’s లో ఓ వెలుగు వెలిగి..
లూనా 50 సీసీ ఇంజన్ తో భారత్ లో మొట్టమొదటి మోపెడ్ గా 1972లో మార్కెట్లోకి వచ్చింది. అయితే.. వచ్చిన కొద్ది కాలంలోనే ఇది అందరి మనసులను గెలుచుకుంది. ఆ తరువాత మార్కెట్లోకి ఎన్నో మోపెడ్ లు వచ్చినా లూనా టీఎఫ్‌ఆర్, డబల్ ప్లస్, వింగ్స్, మేగ్నం, సూపర్ వేరియంట్లతో మార్కెట్ ను ఒక ఊపు ఊపింది.. ఈ మోపెడ్ వచ్చినపుడు దీని ధర రెండు వేల రూపాయలు. దాదాపు మూడు దశాబ్దాల పాటు మార్కెట్లో సంచలనం సృష్టించిన లూనాను 2000 సంవత్సరంలో నిలిపివేశారు. దీంతో క్రమంగా లూనా కనుమరుగయింది.
Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు, జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
అలాగే న్యూస్ అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి ట్విట్టర్, ఫేస్ బుక్ లోనూ సంప్రదించవచ్చు.
Woow
Long time come back
👍👍👍
Nice