Ayodhya: రామ జన్మభూమి అయోధ్యలో క్లీన్, గ్రీన్ మొబిలిటీ కోసం కీలక ముందడుగు పడింది. ETO మోటార్స్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం(UP)లో 500 Electric 3-wheelers (e3Ws) ను నడిపించడానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో ఈటో మోటార్స్ ఒక ఒప్పందాన్నికుదుర్చుకుంది. ఈ వ్యూహాత్మక ఒప్పందంలో భాగంగా యూపీలోని లక్నో, అయోధ్య, వారణాసి, ప్రయాగ్‌రాజ్, ఆగ్రా, మధుర, గోరఖ్‌పూర్ వంటి నగరాల్లో పెట్రోల్ ఆటోలకు బదులు ఎలక్ట్రిక్ ఆటోలు పరుగులు పెట్టనున్నాయి. పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించే భక్తుల కోసం e3Ws రవాణా సౌకర్యాన్ని కల్పిస్తుంది.
అయోధ్యలో పర్యావరణ అనుకూలమైన Electric 3-wheelers ని ప్రవేశపెట్టడం ద్వారా, ETO మోటార్స్ అయోధ్య నగర చారిత్రక ప్రాముఖ్యతను గౌరవించడమే కాకుండా స్థిరమైన, పరిశుభ్రమైన భవిష్యత్తుకు దోహదపడాలని లక్ష్యంగా పెట్టుకుంది. విస్తరణ అనేది కేవలం మౌలిక సదుపాయాల అభివృద్ధి మాత్రమే కాదు, కాలుష్యాన్ని తగ్గించడం దాని సహజమైన వాతావరణాన్ని కల్పించడం ద్వారా నగరం యొక్క పవిత్రతను కాపాడే దిశగా ఒక అడుగు అని కంపెనీ పేర్కొంది.
ETO మోటార్స్ డైరెక్టర్ డాక్టర్ కార్తీక్ S. పొన్నపుల మాట్లాడుతూ.. “మా e3Wలు కేవలం వాహనాలు మాత్రమే కాదు, పర్యావరణ సారథ్యం పట్ల మా నిబద్ధతను ప్రదర్శిస్తాయి. అలాగే సామాజిక సాధికారతను పెంపొందించే వాహకాలుగా నిలుస్తాయన్నారు. ”
Uber తో భాగస్వామ్యం
Uber సహకారంతో, ETO మోటార్స్ పట్టణ రవాణా కోసం ఎలక్ట్రిక్ వాహనాలను రూపొందించడానికి సిద్ధంగా ఉంది. ఈ భాగస్వామ్యంతో ETO మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ నైపుణ్యం, Uber విస్తృతమైన నెట్‌వర్క్ వినూత్న రైడ్-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ కలిసి వినియోగదారులకు చక్కని అనుభూతిని ఇస్తుంది.
ఉబెర్ ఇండియా, దక్షిణాసియాలోని సప్లై ఆపరేషన్స్ డైరెక్టర్ శివ శైలేంద్రన్ ఇలా వ్యాఖ్యానించారు, “ఈ భాగస్వామ్యం దేశవ్యాప్తంగా ఉన్న మా రైడర్‌లకు స్థిరమైన, భాగస్వామ్య మొబిలిటీ ఆప్షన్లను అందిస్తుంది.” అని తెలిపారు.
ETO మోటార్స్ అనుబంధ సంస్థ అయిన ట్రినిటీ క్లీన్‌టెక్ ఏకకాలంలో ఎంపిక చేసిన నగరాల్లో 50-70 EV ఛార్జింగ్ స్టేషన్‌లతో బలమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తోంది, ఇది సమగ్ర ఎలక్ట్రిక్ మొబిలిటీ సొల్యూషన్స్ పట్ల వారి ప్రణాళికను హైలైట్ చేస్తుంది. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) సహకారంతో, ట్రినిటీ క్లీన్‌టెక్ BPCL అవుట్‌లెట్‌లలో 3-వీల్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఫాస్ట్-ఛార్జ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది అయోధ్యలోనే కాకుండా ఉత్తరప్రదేశ్ అంతటా ఛార్జింగ్ సౌలభ్యాన్ని పెంచుతుంది.
స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SIDBI), దాని మిషన్ 50K-EV4ECO కింద, e3Ws విస్తరణకు అలాగే EV ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం ఆర్థిక సహాయాన్ని అందించింది. మరోవైపు ETO మోటార్స్ UBER, కెవాడియా, ఢిల్లీ మెట్రో, L&T మెట్రో హైదరాబాద్, నాగ్‌పూర్ మెట్రో, పెద్ద ఇ-కామర్స్ కంపెనీలతో తన భాగస్వామ్యాన్ని విస్తరించడం కొనసాగిస్తున్నందున, కంపెనీ eMaaS ల్యాండ్‌స్కేప్‌లో మార్పుకు ఉత్ప్రేరకంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..