Ola Electric extends price reduction | బెంగళూరు: ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలుచేయాలనుకునేవారికి గుడ్ న్యూస్.. ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ స్కూటర్లపై డిస్కౌంట్ ఆఫర్ ను మరో నెలరోజుల వరకు పొడిగించింది. మాస్ ఎలక్ట్రిఫికేషన్ కోసం #EndICEAge ప్రోగ్రామ్ ను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఓలా S1 పోర్ట్‌ఫోలియోపై INR 25,000 వరకు ధర డిస్కౌంట్ ఆఫర్ ను గత నెలలో ప్రకటించగా దానిని మార్చి నెలాఖరు వరకు పొడిగించింది
కాగా ఈ ఆఫర్ కింద ప్రస్తుతం ఓలా S1 Pro, S1 Air మరియు S1 X+ వరుసగా INR 1,29,999, INR 1,04,999 మరియు INR 84,999 ఎక్స్ షోరూం ధరల్లో అందుబాటులో ఉంటాయి. భారతదేశంలో గ్రీన్ మొబిలిటీని వేగవంతం చేయడానికి, EV స్వీకరణకు ఉన్న అన్ని అడ్డంకులను తొలగించడానికి కంపెనీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు ఇవీ..
Variant | Current Price |
S1 Pro | INR 1,29,999 |
S1 Air | INR 104,999 |
S1 X (4kWh) | INR 109,999 |
S1 X+ (3kWh) | INR 84,999 |
S1 X (3kWh) | INR 89,999 |
S1 X (2kWh) | INR 79,999 |
అయితే ఈ డిస్కౌంట్ ఆఫర్ ద్వారా తక్కువ ధరలోనే Ola S1 స్కూటర్‌లు అందుబాటులోకి వచ్చాయి. దాదాపుగా సాంప్రదాయ ICE (పెట్రోల్) వాహనాల కంటే తక్కువ ధరలోనే ఉన్నాయి. స్కూటర్ మార్కెట్లో సంవత్సరానికి INR 30,000 వరకు డబ్బులు ఆదా అవుతుందని కంపెనీ చెబుతోంది. ఇటీవల, ఓలా ఎలక్ట్రిక్ ఆటోమొబైల్, ఆటో కాంపోనెంట్ పరిశ్రమలో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం కింద Domestic Value Addition (DVA) సర్టిఫికేట్‌ను పొందిన మొదటి భారతీయ 2W కంపెనీగా అవతరించింది.
బ్యాటరీపై 8 సంవత్సరాల వారంటీ..
మరో వైపు Ola Electric ఇటీవల ఉత్పత్తులు, సర్వీస్, ఛార్జింగ్ నెట్‌వర్క్, బ్యాటరీ వారంటీలో EVల స్వీకరణలో అన్ని అడ్డంకులను అధిగమించే ప్రయత్నంలో అనేక కార్యక్రమాలను ప్రకటించింది. S1 X (4kWh) ప్రారంభంతో, Ola Electric తన పోర్ట్‌ఫోలియోను ఆరు బెస్ట్ క్లాస్ స్కూటర్లకు విస్తరించింది, వివిధ ధరల్లో అన్ని వర్గాల వినియోగదారులకు స్కూటర్లను అందిస్తుంది.
Ola Electric extends price reduction : కంపెనీ పరిశ్రమలో మొట్టమొదటిసారిగా 8 సంవత్సరాల/80,000 కి.మీ ఎక్స్ టెండెడ్ బ్యాటరీ వారంటీని ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అందిస్తోంది. ఇది వాహనాల జీవితకాలాన్ని 2X ICE వాహనాలకు పొడిగించడం ద్వారా EV స్వీకరణకు అతిపెద్ద అడ్డంకిని పరిష్కరించింది. అదనంగా, ఓలా ఎలక్ట్రిక్ ఏప్రిల్ 2024 నాటికి దేశవ్యాప్తంగా ప్రస్తుత 414 సర్వీస్ సెంటర్‌ల నుండి ~600 సెంటర్‌లకు తన సర్వీస్ నెట్‌వర్క్‌ను 50% విస్తరించే ప్రణాళికలను కూడా ఆవిష్కరించింది.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో జాయిన్ కండి.