Home » Sokudo Electric : తక్కువ ధ‌ర‌లోనే ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ను విడుద‌ల చేసిన ఈవీ కంపెనీ

Sokudo Electric : తక్కువ ధ‌ర‌లోనే ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ను విడుద‌ల చేసిన ఈవీ కంపెనీ

Sokudo Electric
Spread the love

Affordable E-Scooters | ఎకో-ఫ్రెండ్లీ ట్రాన్స్‌పోర్టేషన్‌పై దృష్టి సారించిన ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సోకుడో ఎలక్ట్రిక్ ఇండియా (Sokudo Electric India).. తాజాగా FAME-II స్కీమ్‌కు అనుగుణంగా రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌లను విడుదల చేసింది. బడ్జెట్- ఫ్రెండ్లీ బైక్‌లను ప్ర‌వేశ‌పెట్ట‌డం ద్వారా ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయాల‌ని భావిస్తోంది. ఇదిలా ఉండ‌గా ఈ సంస్థ 2023లో అమ్మకాల్లో 36 శాతం పెరుగుదలను న‌మోదు చేసుకుంది. త‌క్కువ ధ‌ర‌లో ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌ను అందుబాటులోకి తీసుకొచ్చి ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లో గణనీయమైన 15-20 శాతం వాటాను సాధించాల‌ని సోకుడో ఎలక్ట్రిక్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది.

రూ.59,889 నుంచి ప్రారంభం

ఈ ‘మేక్ ఇన్ ఇండియా’ స్కూటర్లు భారత మార్కెట్ లో అన్ని వ‌ర్గాల వినియోగ‌దారుల‌కు సరిపోయే విధంగా పోటీ ధరలను కలిగి ఉన్నాయి. కొత్తగా తీసుకొచ్చిన మోడ‌ళ్ల‌లో సెలెక్ట్ 2.2 (RTO) ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ సింగిల్ చార్జిపై రూ. 100 కి.మీల మైలేజీ అందిస్తుంది. ఇది రూ. 85,889 ఎక్స్ షోరూంధ‌ర‌లో అందుబాటులో ఉంది. మరో మోడ‌ల్ , రాపిడ్ 2.2 (RTO) రూ. 79,889. ప్లస్ (లిథియం) (నాన్-ఆర్‌టిఓ) మోడల్, 105 కిమీల పరిధిని కలిగి ఉంది. దీని ధర రూ. 59,889 ల‌కు అందుబాటులో ఉంది.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

సమర్థవంతమైన ఛార్జింగ్, స్మార్ట్ ఫైర్‌ప్రూఫ్ ఫీచ‌ర్ క‌లిగిన‌ లిథియం ఫెర్రో ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీలను ఇందులో వినియోగించారు. బ్యాటరీపై మూడేళ్ల వారంటీని, వాహనంపై ఐదేళ్ల వారంటీని అందిస్తోంది.

Sokudo Electric India వ్యవస్థాపకుడు & CMD ప్రశాంత్ వశిష్ఠ మాట్లాడుతూ.. “ప్రతి నెల, 5 లక్షల మందికి పైగా NON RTO లీడ్-యాసిడ్ స్కూటర్‌లను ఎంచుకుంటున్నారు. వారు త‌క్కువ వారంటీ, రేంజ్ విష‌యంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటి రైడర్‌ల కోస‌మే మరింత సరసమైన ధరలో సురక్షితమైన, మరింత సమర్థవంతమైన నమ్మదగిన ఎల‌క్ట్రిక్‌ వాహ‌నాల‌ను అందించాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. మా మేడ్ ఇన్ ఇండియా సోకుడో ఎలక్ట్రిక్ స్కూటర్లలో ప్ర‌తీ వినియోగ‌దారుడు చ‌క్క‌ని రైడింగ్ అనుభ‌వాన్ని పొందుతాడ‌ని తెలిపారు. అంతర్జాతీయ బ్రాండ్‌లతో పోల్చితే మేము అత్యుత్తమ మొబిలిటీ సొల్యూషన్ ప్రొవైడర్‌గా నిలుస్తామ‌నే విశ్వాసం త‌మ‌కు ఉంద‌ని తెలిపారు.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *