Bajaj CNG Bike | ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ సంస్థ బజాజ్ ఆటో వచ్చే జూన్ లోనే భారత్ లోనే మొట్టమొదటి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG)తో నడిచే బైక్ ను లాంచ్ చేయనుంది. మిగతా పెట్రోల్ బైక్ లకంటే అత్యధిక మైలేజీని ఇవ్వడమే కాకుండా పర్యావరణానికి కూడా ఎలాంటి హాని కలిగించని ఉద్గారాలను ఈ బైక్ విడుదల చేస్తుంది. అత్యధిక మైలేజీ కోరుకునేవారిని ఆకట్టుకునేలా కొత్త బైక్ ఉంటుందని, ప్రత్యేకమైన బ్రాండ్‌తో విడుదల చేయాలని భావిస్తున్నామని బజాజ్ కంపెనీ ప్రతినిధి రాజీవ్ బజాజ్ వెల్లడించారు.
బైక్ లో రెండు ఇంధన ట్యాంకులు
అయితే ఈ కొత్త తరహా ద్విచక్రవాహానంలో CNG కిట్ తోపాటు పెట్రోల్ ట్యాంకును అమర్చడం వల్ల పెట్రోల్, CNG రెండు రకాల ఇంధనాలతో వాహనాన్నినడిపే వెసులు బాటు ఉంటుంది. ఈ కారణంగా CNG మోటార్‌సైకిళ్లు సాంప్రదాయ పెట్రోల్ వాహనాలతో పోలిస్తే అధిక ధరను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
భారతీయులందరికీ సమగ్రమైన సంపన్నమైన భవిష్యత్తును పెంపొందించడంలో తమ గ్రూప్ దృఢమైన అంకితభావాన్నికలిగి ఉందని రాజీవ్ బజాజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. మునుపటి సంవత్సరం ప్రారంభించిన బజాజ్ ఇంజినీరింగ్ స్కిల్స్ ట్రైనింగ్ (బెస్ట్) ప్రోగ్రాం వంటి కార్యక్రమాల నుంచి పొందిన ప్రేరణతో కొత్త ఆవిష్కరణలు చేస్తున్నామని తెలిపారు.
మైలేజీ 400 కి.మీ/ కిలో..?
Bajaj CNG Bike Mileage : ఇది CNG సిలిండర్ కోసం బైక్ లో కొన్ని మార్పులు చేయవచ్చు. బజాజ్ రెండు ఇంధన సెటప్ (CNG+పెట్రోల్) లేదా సింగిల్ CNG వేరియంట్ అమలు చేస్తుందో లేదో తెలియరాలేదు. CNG ట్యాంక్ దాని పొడవాటి సీటు కింద అమర్చబడి ఉండవచ్చని తెలుస్తోంది. లేదా, నేరుగా బైక్ ఫ్రేమ్‌పై అమర్చబడి ఉంటుందని కొందరు అనుమానిస్తున్నారు. ట్యాంక్ కెపాసిటీ 5 కిలోల సిఎన్జి కెపాసిటీ వరకు ఉండవచ్చు. బజాజ్ 80 కి.మీ/కిలో మైలేజీ ఇస్తుందని భావిస్తే. ఒక్కసారి ట్యాంక్ ఫుల్చేస్తే.. దాదాపు 400 కి.మీ మైలేజీ ఇవ్వవచ్చు.. బజాజ్ ఈ CNG మోటార్‌సైకిల్‌ను 2024 మధ్యలో ప్రారంభించే అవకాశం ఉంది. దాదాపు జులై 2024 నాటి టైమ్ ఫ్రేమ్‌ని తరువాత తేదీలో లాంచ్ చేయవచ్చని భావిస్తున్నారు.
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో జాయిన్ కండి.