Kurma Village | ఆ గ్రామానికి వెళితే మనం 200 ఏళ్ల క్రితం నాటి ప్రాచీనకాల వాతావరణాన్ని ప్రత్యక్షంగా అనుభవిస్తాం.. అక్కడ స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఆటోమేటిక్ గాడ్జెట్లు ఏవీ కనిపించవు. ఆంధ్రప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామం ఆధునిక సాంకేతికత లేని పురాతన కాలానికి నడిపిస్తూ గడియారాన్ని ‘వెనక్కిస తిప్పారు. ఈ గ్రామంలో కనీసం విద్యుత్ సౌకర్యం కూడా వినియోగించుకోకుండా ఆధునిక కృత్రిమ జీవన విధానానికి దూరంగా సాంప్రదాయ గ్రామీణ భారతీయ జీవన విధానాన్ని అవలంబిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలోని కుర్మ గ్రామానికి వెళ్లతే అన్నిఆశ్చర్యం కలిగించే విషయాలను తెలుసుకోవచ్చు. గ్రామంలోకి ప్రవేశించిన తర్వాత ప్రకృతితో మమేకమై జీవించే వ్యక్తులతో స్వచ్ఛమైన గ్రామీణ భారతీయ జీవనశైలిని గమనించవచ్చు. గ్రామస్తులు కాంక్రీట్ ఇళ్లలో నివసించే బదులు మట్టి, పెంకుండ్లలో నివసించడానికి ఇష్టపడతారు. ఇంతటి విశిష్టత కలిగిన ఈ గ్రామంలో ఇళ్ల నిర్మాణానికి ఇనుము, సిమెంటు కూడా ఉపయోగించరు. ఇక్కడ గుడిసెలు భారతీయ సంప్రదాయ పద్ధతిలో ఇసుక, సున్నం, బెల్లం, పప్పు మిశ్రమంతో నిర్మించారు. వారు తమ బట్టలు ఉతకడానికి ఎటువంటి ఇక్కడ డిటర్జెంట్ పౌడర్‌ను ఉపయోగించరు. అందుకు బదులుగా సహజ పదార్ధాలను మాత్రమే ఉపయోగిస్తారు.
సేంద్రియ, గో ఆధారిత వ్యవసాయం
2018లో ఇంటర్నేషనల్ కృష్ణ కాన్షియస్నెస్ అసోసియేషన్ స్థాపకుడు స్వామి ప్రభుపాద ఈ గ్రామాన్ని స్థాపించారు. గ్రామ నివాసితుల్లో గొప్ప విద్యావంతులు, సంపన్న కుటుంబాల నుంచి వచ్చినవారు ఉన్నారు. వీరు స్వయం-స్థిరమైన గ్రామీణ జీవనశైలిని నడిపిస్తారు, అక్కడ వారు ప్రకృతి నుంచి ఉన్ని, వస్త్రం వంటి అవసరమైన వస్తువులను పొందుతారు. స్వయంగా సేంద్రియ, గో ఆధారిత వ్యవసాయం చేసి వీరికి కావలసిన ఆహార ధాన్యాలు, కూరగాయలను పండించుకుంటారు.
ఉదయం లేవగానే వాట్సప్ మెసేజ్ లు, ఇమెయిల్‌లు, ఫేస్బుక్, ఇన్ స్టాగ్రామ్ నోటిఫికేషన్లను సెర్చ్ చేయడం మనకు సర్వసాధారనం. కానీ ఈ గ్రామస్థులు తెల్లవారుజామున 4.30 గంటలకు నిద్రలేచి, ఆరతి ఇచ్చి భగవంతుని స్తోత్రం చేస్తారు. “ప్రసాదం” తీసుకున్న తర్వాత వారు వ్యవసాయం, ఇళ్ల నిర్మాణం, మతపరమైన ఆచారాలు వంటి వారి రోజువారీ పనులకు వెళతారు.
సంప్రదాయ విద్యావిధానం..
Kurma Village ఇక్కడ నాణ్యమైన విద్య పిల్లలకు అందుతుంది. పాఠశాల ఫీజుల కోసం వేలకు వేలు ధారపోయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చదువు అందరికీ ఉచితం. సైన్స్‌లోని వివిధ విభాగాలను నేర్చుకోవడమే కాకుండా, విద్యార్థులు వేద విద్యా విధానం ద్వారా స్వీయ నియంత్రణ, సత్ప్రవర్తనకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తారు. ఇక్కడి విద్యార్థులు తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, హిందీ భాషలలో అనర్గళంగా మాట్లాడుతారు. కూర్మా గ్రామంలో తమ జీవితాలను యాంత్రికంగా మార్చుకోకుండా విద్యుత్ వినియోగానికి స్వస్తి పలకాలని నిర్ణయించుకున్నారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..