Ola Electric Roadster | ఓలా ఎలక్ట్రిక్ భారతదేశంలో మూడు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లను విడుదల చేసింది. ఇందులో ఓలా రోడ్‌స్టర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ శ్రేణిలో రోడ్‌స్టర్ X, రోడ్‌స్టర్, రోడ్‌స్టర్ ప్రో ఉన్నాయి. రోడ్‌స్టర్ X ఎలక్ట్రిక్ బైక్ (Roadster X ) ధర రూ. 74,999 (ఎక్స్-షోరూమ్) నుంచి రూ.99,999 (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. రోడ్‌స్టర్ మోడల్ ధర రూ. 1.05 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి రూ.1.40 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. ఇక ప్రీమియం మోడల్ రోడ్‌స్టర్ ప్రో ధర రూ. 2 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ. 2.50 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
ఓలా ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ (Ola Electric Roadster)
రోడ్‌స్టర్ X బైక్ 2.5kWh, 3.5kWh, 4.5kWh బ్యాటరీ ప్యాక్‌తో ఉంటుంది. మీడియం రేంజ్ బైక్ రోడ్‌స్టర్ 3.5kWh, 4.5kWh మరియు 6kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. అయితే రోడ్‌స్టర్ X 8kWh, 16kWh బ్యాటరీ ప్యాక్ లతో లభిస్తుంది. Ola పైన పేర్కొన్న అన్ని ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లకు రిజర్వేషన్‌లను ఓపెన్ చేసింది. రోడ్‌స్టర్ X, రోడ్‌స్టర్‌ల డెలివరీలు Q4 FY25లో ప్రారంభమవుతాయి, అయితే రోడ్‌స్టర్ ప్రో కోసం డెలివరీలు Q4 FY26 నుంచి ప్రారంభమవుతాయి.
ఓలా ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ ప్రో
S1 స్కూటర్ పోర్ట్‌ఫోలియో మాదిరిగానే Ola Electric తన మొత్తం మోటార్‌సైకిల్ మోడళ్లకు కూడా బ్యాటరీ ప్యాక్ పై ఏకంగా 8 సంవత్సరాల వారంటీని అందిస్తోంది. అంతేకాకుండా, Q1 FY26 నుంచి కంపెనీ తన ఎలక్ట్రిక్ వాహనాలలో దాని స్వంత సెల్‌లను అమర్చనున్నట్లు ప్రకటించింది. ఈ సెల్ ప్రస్తుతం ఓలా కంపెనీకి చెందిన గిగాఫ్యాక్టరీలో ట్రయల్ ప్రొడక్షన్‌లో ఉంది. ఓలా ఎలక్ట్రిక్ భవిష్యత్ వాహనాలన్నీ కంపెనీకి చెందిన Gen-3 ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటాయి. Ola ఈ సంవత్సరం పండుగ సీజన్‌లో తన కొత్త MoveOS 5 బీటా వెర్షన్‌ను కూడా పరిచయం చేయనుంది.
[table id=39 /]
ఓలా ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ X
రోడ్‌స్టర్ X 11kW పీక్ పవర్ అవుట్‌పుట్, రోడ్‌స్టర్ 13kW పీక్ పవర్ అవుట్‌పుట్ అలాగే రోడ్‌స్టర్ ప్రో 52KW పీక్ పవర్, 105Nm పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. టాప్-ఎండ్ రోడ్‌స్టర్ X వేరియంట్ 200 కిమీ రేంజ్ కలిగి ఉంటుంది.
రోడ్‌స్టర్ క్లెయిమ్ చేసిన రేంజ్ 248కిమీ కాగా , రోడ్‌స్టర్ ప్రో టాప్ వేరియంట్ 579కిమీల IDC రేంజ్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. తమిళనాడులోని కృష్ణగిరిలోని ఫ్యూచర్‌ఫ్యాక్టరీలో జరిగిన ఓలా వార్షిక ప్రారంభ కార్యక్రమంలో ఈ వివరాలను వెల్లడించింది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..