Bajaj Chetak 2903 | బజాజ్ ఆటో తన ఈవీ మార్కెట్ లో దూసుకుపోతోంది. నెలల వ్యవధిలోనే కొత్తకొత్త మోడళ్లను పరిచయం చేస్తూ మిగతా కంపెనీలకు దడ పుట్టిస్తోంది. అయితే కొత్తగా చేతక్ 2903ని పరిచయం చేయడం ద్వారా బజాజ్ తన ఇ-స్కూటర్ లైనప్‌ను విస్తరించాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం బజాజ్ చేతక్ పోర్ట్‌ఫోలియోలో అత్యంత సరసమైన ధర కలిగిన చేతక్ 2901 ఉంది.
చేతక్ 2901 మరియు అర్బనే వేరియంట్ మధ్య దాదాపు రూ. 22,000 గ్యాప్ ఉన్నందున చేతక్ 2903 కొత్త వేరియంట్ 2901 వేరియంట్ కంటే కాస్త ఎక్కువ ధర ఉండే అవకాశం కనిపిస్తోంది.ఫీచర్లకు సంబంధించి, 2901 కంటే 2903 వేరియంట్ లో ఎక్కువ ఫీచర్లను అందించనున్నారు. అయితే కొత్త స్కూటర్ డిజైన్ లో ఎలాంటి మార్పులు ఉండవు. కానీ కొత్త కలర్ వేరియంట్లలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఇక పనితీరు విషయానికొస్తే, Bajaj Chetak 2903 అదే 2.9kWh బ్యాటరీ ప్యాక్‌ను పొందుతుంది. ఇది ఒక ఛార్జ్‌పై ARAI- ధృవీకరించబడిన 123 కిమీ పరిధిని అందిస్తుంది. వాస్తవ ప్రపంచ పరిధి 90-100 కి.మీ.గా ఉంటుందని అంచనా. స్కూటర్ గరిష్టంగా 63kmph వేగంతో ప్రయాణిస్తుంది. ఇది 4kw ఎలక్ట్రిక్ మోటారును కలిగిఉంటుంది. 2901 వేరియంట్ లో ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ లేదు.ఇది ఫుల్ చార్జ్ కావడానికి ఏకంగా 6గంటల సమయం తీసుకుంటుంది. అయితే చేతక్ 2903 లో మాత్రం ఫాస్ట్ చార్జింగ్ సౌకర్యాన్ని అందించనున్నారు.
కొత్త చేతక్ 2903 స్కూటర్ ధర దాదాపు రూ. 1.2 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండే అవకాశం ఉంది. మరికొద్ది వారాల్లో ఇది మార్కెట్ లోకి రానుంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..