Home » భారతదేశపు మొట్టమొదటి ADAS-అమర్చిన ఎలక్ట్రిక్ కార్గో వెహికిల్‌.. 15 నిమిషాల చార్జితోనే 100కిమీ రేంజ్‌

భారతదేశపు మొట్టమొదటి ADAS-అమర్చిన ఎలక్ట్రిక్ కార్గో వెహికిల్‌.. 15 నిమిషాల చార్జితోనే 100కిమీ రేంజ్‌

Storm EV Electric Cargo Vehicles
Spread the love

Storm EV Electric Cargo Vehicles | ఇంటర్‌సిటీ, ఇంట్రాసిటీ ర‌వాణా కోసం రూపొందించిన Storm EV ఎలక్ట్రిక్ కార్గో వాహనాలను Euler Motors కంపెనీ తాజాగా విడుదల చేసింది. ఇందులో రెండు మోడ‌ళ్లు మొద‌టిది Storm EV LongRange 200 (intercity) కాగా, రెండ‌వ‌ది Storm EV T1250 (ఇంట్రాసిటీ). ఇవి రెండూ 1250 Kg పేలోడ్ కెపాసిటీతో వస్తాయి. 4W లైట్ కమర్షియల్ వెహికల్ (LCV) సెగ్మెంట్‌లోకి కంపెనీ అడుగుపెట్టింది. Storm EV LongRange 200 ఎక్స్ షోరూం ధర రూ. 12.99 లక్షలు కాగా, Storm EV T1250 ధర రూ. 8.99 లక్షలుగా ఉంది.

కొత్త వాహ‌నాల‌ లాంచ్‌లతో Euler Motors 10 ఇతర సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లతో పాటు భారతదేశంలో LCV విభాగంలో మొదటిసారిగా ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్)ని కూడా ప్రవేశపెట్టింది .స్టార్మ్ EV లాంగ్ రేంజ్ 200 – నగరాల మధ్య కార్గో మొబిలిటీని ప్రారంభించడానికి 200 కి.మీ పరిధితో ఇంటర్‌సిటీ ఉపయోగం కోసం రూపొందించింది. CCS ఫాస్ట్ ఛార్జింగ్ హైవే ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను సులభంగా యాక్సెస్ చేస్తుంది. 15 నిమిషాల ఛార్జింగ్‌లో 100 కిమీ రేంజ్ అందిస్తుంది.

ఇంట్రాసిటీ కోసం ప్ర‌వేశ‌పెట్టిన Storm EV T1250 కార్గొ వాహ‌నం 140 కి.మీ రేంజ్ ఇస్తుంది. 8.2 అడుగుల పొడవు, 220 మరియు 260 Cft వాల్యూమెట్రిక్ కెపాసిటీని కలిగి ఉంది. DC001 ఫాస్ట్ ఛార్జింగ్ ప్రోటోకాల్ 30 నిమిషాల ఛార్జింగ్‌లో 100 కిమీ పరిధిని అందిస్తుంది. ఇది రెండు వేరియంట్లలో వస్తుంది భారీ లేదా సాధారణ లోడ్‌లను మోయడానికి. ఆర్మర్డ్ వేరియంట్, మోర్టార్, కలప, భారీ సిలిండర్‌ల వంటి అధిక‌ లోడ్‌ల కోసం 4 మిమీ ఆర్మర్డ్ స్కేట్‌బోర్డ్ చట్రం కలిగి ఉంటుంది .

ఆక‌ట్టుకునే స్మార్ట్ ఫీచ‌ర్లు..

స్టార్మ్ ఈవీతో, కంపెనీ మొదటిసారిగా LCV విభాగంలో ADASను పరిచయం చేసింది., NVA (నైట్ విజన్ అసిస్ట్), ఫ్రంట్ మరియు రివర్స్ కెమెరా ట‌చ్ అల‌ర్ట్ ఫీచ‌ర్ల‌ను కూడా అందిస్తోంది. NVA చీకటిలో కూడా రహదారిపై ఉన్న అడ్డంకుల స్పష్టమైన ఇమేజింగ్‌ను అందిస్తుంది. తద్వారా ముఖ్యమైన డెలివరీలను పూర్తి చేయడానికి డ్రైవర్‌లు తమ డ్రైవింగ్ సమయాన్ని సురక్షితంగా కొన‌సాగించేందుకు వీలు కల్పిస్తుంది. కెమెరా అల‌ర్ట్‌లు, ట్రాఫిక్ లైట్ హెచ్చరికల వంటివి డ్రైవ‌ర్ కు ఎక్కువ రోడ్ సేఫ్టీని అందిస్తాయి.

Storm EV Electric Cargo Vehicles : భారతదేశం అంతటా ఫోర్ వీల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ వాహన యజమానుల నుంచి ఇన్‌పుట్‌లతో అభివృద్ధి చేసిన Storm EV T1250 LCV విభాగానికి 11 కొత్త ఫీచర్‌లను అందించింది. కొన్ని ICE కౌంటర్‌పార్ట్‌లలో కూడా ఉన్నాయి. ఇవన్నీ కస్టమర్‌లు ఆదాయాలను పెంచడానికి, మంచి TCOని అందించడానికి అధిక భద్రతను అందించడానికి వీలు కల్పిస్తాయి.

కంపెనీ ఏం చెబుతోంది..

“మేము 4W LCV సెగ్మెంట్‌లో EV మోడళ్లతో ప్రవేశించినందుకు సంతోషిస్తున్నాము. ఇవి ప్రతిరోజూ కస్టమర్ ఆదాయాలను పెంచుతాయి. వారి కార్యకలాపాలను ఇంటర్‌సిటీ విభాగంలోకి విస్తరించడానికి వీలు కల్పిస్తాయి. అని యూలర్ మోటార్స్ CEO, ఫౌండ‌ర్ సౌరవ్ కుమార్ అన్నారు. “కస్టమర్లు ICE వాహనాలపై భారీ ప్రీమియం చెల్లించకుండా ఆదాయాన్ని పెంచుకోవాలనుకుంటున్నారు. ఈస‌మ‌యంలో Storm EV దాని ICE ప్రత్యర్ధులతో స‌మాన ధరలోనే అధిక‌ పనితీరు, సామర్థ్యం, భద్రతా ప్రమాణాలను అద్భుత‌మైన సామర్థ్యాలు ఆక‌ర్ష‌ణీయ‌మైన‌ డిజైన్‌ను క‌లిగి ఉంటుంది అని తెలిపారు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *