దేశంలోనే అతిపెద్ద Ev చార్జింగ్ స్టేషన్.. ఎక్కడంటే..
ఒకేసారి 100 కార్లను ఛార్జ్ చేయవచ్చు ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ వాహనాల కోసం 100 ఛార్జింగ్ పాయింట్ల సామర్థ్యంతో ఇండియాలో అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ (EV) Charging station (ఛార్జింగ్ స్టేషన్) ను శుక్రవారం హర్యానాలోని గురుగ్రామ్‌లోని ఢిల్లీ-జైపూర్ జాతీయ రహదారిలో ప్రారంభించారు. గతంలో దేశంలో అతిపెద్ద EV ఛార్జింగ్ స్టేషన్ నవీ ముంబైలో 16 AC/ 4 DC ఛార్జింగ్ పోర్ట్‌లతో ఉండగా, తాజాగా గురుగ్రాంలో టెక్-పైలటింగ్ కంపెనీ అలెక్ట్రిఫై ప్రైవేట్ లిమిటెడ్ (Alektrify ) ఏర్పాటు చేసిన చార్జింగ్ స్టేషన్ అతిపెద్దదిగా అవతరించింది.ఈ చార్జింగ్ స్టేషన్‌లో 72 AC ఛార్జర్‌లు, 24 DC ఫాస్ట్ ఛార్జర్‌లతో సహా మొత్తం 100 ఛార్జింగ్ పాయింట్‌లను కలిగి ఉంది.ఈ స్మార్ట్ EV ఛార్జింగ్ స్టేషన్ నాలుగు చక్రాల వాహనాల కోసం 100 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. వీటిలో 72 య...