
Revolt RV400 కస్టమర్లకు శుభవార్త
రివోల్ట్ బైక్కు కొత్త ఫీచర్ల
కీ అవసరం లేకుండా స్వైప్ టూ స్టార్ట్ ఫీచర్Revolt RV400 ఎలక్ట్రిక్ బైక్ వినియోగదారులకు శుభవార్త. రివోల్ట్ మోటార్స్ సంస్థ కీలెస్ మోటార్ ఆన్/ఆఫ్ ఫీచర్‌ను అందిస్తోంది. రివాల్ట్ మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ తన మొట్ట మొదటి రెండు మోటార్‌సైకిళ్లను 2019 లో విడుదల చేసింది. అచ్చం పెట్రోల్ స్పోర్ట్స్ బైక్‌ను తలపించేలా వచ్చిన ఈ బైక్‌కు వచ్చిన క్రేజ్ అంతాఇంతా కాదు. ఈ బైక్ పై వచ్చిన డిమాండ్‌తో సప్లయి చేయలేక రివోల్ట్.. బుకింగ్‌లను నిలిపివేయవలసి వచ్చింది.
అయితే తన వినియోగారుల కోసం ఇప్పుడు కంపెనీ తన రివోల్ట్ ఆర్వీ 400ను అప్‌డేట్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో డెలివరీ చేయనున్న కొత్త Revolt RV400 బైక్‌లు స్మార్ట్‌ఫోన్ ఆధారిత కీలెస్ మోటార్ ఆన్/ఆఫ్ ఫీచర్‌తో వస్తాయి.మోటార్‌సైకిల్‌ని సమీపించేటప్పుడే తమ స్మార్ట్‌ఫోన్‌లో రివాల...