atum e-bike

ఆట‌మ్ నుంచి మ‌రో కొత్త ఎల‌క్ట్రిక్ బైక్‌ AtumVader

Spread the love

గంట‌కు 65కి.మి వేగం, 100కి.మి రేంజ్

హైదరాబాద్‌కు చెందిన ఈవీ వీలర్ స్టార్టప్ కంపెనీ Atumobile సంస్థ భార‌తీయ‌ మార్కెట్ల‌లో తమ రెండో ఎలక్ట్రిక్ టూ వీలర్ విడుదల చేయ‌డానికి స‌న్న‌ద్ధ‌మైంది. ఈ కంపెనీ విడుద‌ల చేసిన ఆటమ్ వాడెర్ (AtumVader) కోసం ఈ కంపెనీ ఆటోమొబైల్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ARAI) నుంచి ధృవీకరణను పొందింది. ఇదొక‌ కేఫ్ రేసర్ డిజైన్ కలిగిన బైక్. కంపెనీ దీనిని తెలంగాణలోని ఫ్యాక్టరీలోనే ఉత్పత్తి చేయడానికి స‌న్నాహాలు చేస్తోంది.

atum e bike
రెండో ఎలక్ట్రిక్ బైక్‌..

2020 సెప్టెంబరులో Atumobile సంస్థ తమ మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ “ఆటమ్ 1.0ను ఇండియ‌న్ మార్కెట్‌లో విడుదల చేసింది. ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్ ప్రారంభ ధర కేవలం రూ.50,000 మాత్రమే ఉంది. అయితే గ‌త రెండు సంవ‌త్స‌రాల్లో ఈ ఎలక్ట్రిక్ బైక్ కు డిమాండ్ పెరగడంతో కంపెనీ దీని ధరను కూడా భారీగా పెంచింది. మార్కెట్లో ప్ర‌స్తుతం ఈ ఎలక్ట్రిక్ బైక్ ప్రారంభ ధర (ఎక్స్-షోరూమ్) రూ.74,999.
అయితే కంపెనీ కొత్తగా ధృవీకరణ పొందిన AtumVader ఎల‌క్ట్రిక్ మోటార్‌సైకిల్ విషయానికి వస్తే.. ఇందులో 2.4 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఈ బైక్ ట్యూబ్లర్ ఫ్రేమ్‌పై నిర్మించారు. అన్నీ ఎల్ఈడీ లైట్లు వినియోగించారు. కాగా కొత్త AtumVader దేశంలోనే మొట్టమొదటి హై-స్పీడ్ ఎలక్ట్రిక్ కేఫ్ రేసర్ బైక్ అవుతుందని భావిస్తున్నారు. దీనిని భారతదేశంలో డిజైన్ చేసి ఇక్కడే స్థానికంగా త‌యారు చేస్తామ‌ని కంపెనీ పేర్కొంది.

గంట‌కు 65కి.మి వేగం

ఈ ఎల‌క్ట్రిక్ -బైక్ గరిష్ట వేగం గంటకు 65 కిలోమీటర్లు ఉంటుంది. ఇది ఫుల్ ఛార్జ్ పై గరిష్టంగా 100 కిలోమీటర్ల వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కెఫే రేసర్ బైక్‌లో హ్యాండ్ క్లచ్, లెగ్ బ్రేక్ ఉండదు. బైక్ ను ఆపడానికి హ్యాండ్ బ్రేక్ ఉంటుంది. ఈ బైక్‌లో అనేక అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. వాటిలో ఫుల్ ఎల్‌సిడి డిజిటల్ స్క్రీన్, రెండు డిస్క్ బ్రేక్స్‌, యాంటీ-థెఫ్ట్ అలారం, జియో-ఫెన్సింగ్, బ్లూటూత్, రిమోట్ లాక్ వంటి ఫీచర్లు ముఖ్య‌మైన‌వి.

పూర్తి చార్జ్‌పై 100 కిమీ రేంజ్

ఆటంమొబైల్ ఈ వాడెర్ ఇ-బైక్ తయారీలో స్థానికంగా లభించే విడిభాగాలలో దాదాపు 90 శాతం వాటిని ఉపయోగించడం ద్వారా దీని తయారీ ఖర్చును తక్కువగా ఉంచాలని చూస్తోంది. ఆటంవాడెర్ భారత మార్కెట్లో ఈ కంపెనీ యొక్క రెండవ ఎలక్ట్రిక్ బైక్ అవుతుంది. ఇంతకుముందు, ఈ కంపెనీ ఆటమ్ 1.0 ఇ-బైక్‌ను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది మరియు ఈ మోడల్ అమ్మకాలు సానుకూలంగానే సాగుతున్నాయి.

Atum 1.0 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ పాతకాలపు కేఫ్-రేసర్ మోటార్‌సైకిల్ మాదిరిగా డిజైన్ చేయబడి ఉంటుంది. దీని డిజైన్ చాలా సింపుల్‌గా మరియు మినిమలిస్టిక్‌గా ఉంటుంది. ఇది టీనేజర్లు, యువకులు వయోజనలు వంటి అన్ని వర్గాల కస్టమర్లను దృష్టిలో ఉంచుకొని, అందుబాటు ధరలో ఉండేలా తయారు చేసిన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్. ఈ మోటార్‌సైకిల్‌ను ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఐసిఎటి) తక్కువ-వేగవంతమైన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంగా ధృవీకరించింది. కాబట్టి దీనిని నడపడానికి లైసెన్స్ కానీ లేదా రిజిస్ట్రేషన్ కానీ అవసరం ఉండదు.

ఎంట్రీ లెవ‌ల్ ఎల‌క్ట్రిక్‌ మోటార్‌సైకిల్‌లో 48 వోల్ట్ 250 వాట్ ఎలక్ట్రిక్ మోటార్‌ను అమ‌ర్చారు. ఇది పోర్టబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో పనిచేస్తుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 100 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ యొక్క గరిష్టం వేగం గంటకు 25 కిలోమీటర్లు ఉంటుంది. ఈ బైక్ లోని బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేయడానికి 4 గంటలు పడుతుంది.

ఆటమ్ 1.0 ఇ-బైక్ చూడటానికి సింపుల్‌గా ఉంటుంది. కానీ ఇందులో కంపెనీ ప‌లు ఫీచర్లను అందిస్తోంది. వీటిలో ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడి టెయిల్ లైట్స్, ఎల్‌ఈడి టర్న్ ఇండికేటర్స్, స్టైలిష్ కేఫ్-రేసర్ డిజైన్, సౌకర్యవంతమైన సింగిల్ పీస్ సీట్, బిగ్ ఫ్యాట్ టైర్లు, బెస్ట్-ఇన్-క్లాస్ గ్రౌండ్ క్లియరెన్స్(280 మి.మీ) ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కోసం డిజిటల్ డిస్‌ప్లే ఉన్నాయి.

ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్‌లోని బ్యాటరీ పూర్తిగా చార్జ్ చేసేందుకు కేవలం 1 యూనిట్ విద్యుత్ మాత్రమే ఖ‌ర్చ‌వుతుంద‌ని కంపెనీ చెబుతోంది. అంటే సగటున ఇది 100 కిలోమీటర్లకు రోజుకు కేవలం 7 నుండి 10 రూపాయలు మాత్రమే ఖర్చు అవుంద‌ని అంచ‌నా. ఆసక్తిగల కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ బైక్ ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుండి రూ.999 మొత్తంతో బుక్ చేసుకోవచ్చు.

 

More From Author

TVS iQube price drop

2022 TVS iQube మూడు వేరియంట్లు.. తేడాలు గ‌మ‌నించారా?

Hero MotoCorp charging stations

మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్‌గా Ather 450 electric scooter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest

హీరో మోటోకార్ప్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్ ‌‌ – Vida Ubex Electric Motorcycle

Hero MotoCorp Vida Ubex Electric Motorcycle : హీరో మోటోకార్ప్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్) సంస్థ‌ ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగం, విడా, వచ్చే నెలలో మిలన్‌లో జరగనున్న EICMA 2025లో తన ఉనికిని చాటుకోవడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో బ్రాండ్ విడా ఉబెక్స్ అనే సరికొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ కాన్సెప్ట్‌ను...