2022 TVS iQube మూడు వేరియంట్లు.. తేడాలు గ‌మ‌నించారా?

TVS iQube price drop
Spread the love

2022 TVS iQube వేరియంట్లు తేడాలు ఇవే..

దేశంలో ప్ర‌ఖ్యాతిగాంచిన TVS మోటార్ కంపెనీ త‌న iQube ఎలక్ట్రిక్ స్కూటర్‌ను అప్‌గ్రేడ్ చేసింది. ఇది ఇప్పుడు లాంగ్ రేంజ్ శ్రేణితో పాటు కొన్ని ఫీచర్స్‌ను జోడించింది. మరో విశేషం ఏమిటంటే ఈ TVS iQube ఇప్పుడు మూడు విభిన్న వేరియంట్లలో లభ్యమవుతోంది. అయితే ఈ మూడు వేరియంట్ల మధ్య వ్యత్యాసాలను ఒక‌సారి ప‌రిశీలిద్దాం..

READ MORE  Simple OneS | ఓలాకు పోటీగా కొత్తగా సింపుల్ వన్ ఎస్..

TVS iQube ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ మొద‌ట 2020లో ప్రారంభించారు. ఈ మోడల్ అప్ప‌ట్లో ఒక క‌ల‌ర్‌లో మాత్ర‌మే అందుబాటులో ఉండేది. అయితే భారతదేశంలో అనేక కంపెనీ ప‌లు హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లను ప్రవేశపెట్టడంతో TVS కూడా త‌న పంథాను మార్చుకుంది. మార్క‌ట్‌లో గ‌ట్టి పోటీ ఇచ్చేందుకు త‌న మోడ‌ల్‌ను అప్‌డేట్ చేయాల్సి వచ్చింది. 2022 స‌రికొత్త అప్‌డేట్‌ల‌తో మూడు వేరియంట్‌లను తీసుకువచ్చింది. అవి iQube, iQube S, iQube ST. మూడు వేరియంట్‌లు కొన్ని చిన్న, కొన్ని పెద్ద మార్పులతో వస్తాయి.

డిజైన్, క‌ల‌ర్స్‌..

పరిమాణం, కొలతలు పరంగా మూడు వేరియంట్‌లు ఒకే విధంగా ఉంటాయి. అవుట్‌గోయింగ్ మోడల్‌తో పోలిస్తే డిజైన్ పెద్దగా మారలేదు. ఒక చిన్న మార్పు ఐక్యూబ్ S అలాగే ఐక్యూబ్ ST మోడల్‌లలో పెద్ద విజర్ రూపంలో వస్తుంది. మూడు వేరియంట్‌లు వేర్వేరు రంగుల ఆప్ష‌న్‌లో అందుబాటులో ఉన్నాయి, స్టాండ‌ర్డ్ iQube పెరల్ వైట్, టైటానియం గ్రే గ్లోసీ, షైనింగ్ రెడ్ కలర్ స్కీమ్‌ల‌లో అందుబాటులో ఉంది. అలాగే ఐక్యూబ్ iQube S, ST మోడల్‌లు నాలుగు రంగుల ఎంపికలను పొందుతుంది. అవి మెర్క్యురీ గ్రే గ్లోసీ, మింట్ బ్లూ, లూసిడ్ ఎల్లో, కాపర్ బ్రాంజ్ గ్లోసీ. స్టార్‌లైట్ బ్లూ గ్లోసీ, టైటానియం గ్రే మ్యాట్ కోరల్ సాండ్ గ్లోసీ, కాపర్ బ్రాంజ్ మ్యాట్‌తో వ‌స్తుంది.

READ MORE  Simple OneS | ఓలాకు పోటీగా కొత్తగా సింపుల్ వన్ ఎస్..

హార్డ్‌వేర్ & ఫీచర్లు

ఐక్యూబ్‌ మూడు మోడళ్ల మధ్య బరువులో వ్యత్యాసం ఉంది. ST మోడల్ ఇతర రెండు వేరియంట్‌ల కంటే దాదాపు 10 కిలోల బరువు ఎక్కువగా ఉంటుంది. iQube మోడ‌ళ్లు 90/90-12-అంగుళాల టైర్‌లపై నడుస్తుంది. అయితే, వెనుక డ్యూయల్ హైడ్రాలిక్ స్ప్రింగ్‌లు S మరియు ST వేరియంట్‌లలో మాత్రమే సర్దుబాటు చేయబడతాయి.

2022 TVS iQube కొలతలు

పొడవు 1805 మిమీ
వెడల్పు 645 మిమీ
ఎత్తు 1140mm
వీల్ బేస్ 1301mm
గ్రౌండ్ క్లియరెన్స్ 157mm
సీటు ఎత్తు 770mm

iQube బరువు – 117.2kg
iQube S – 118.8kg
iQubeST – 128kg

iQube యొక్క బేస్ మోడల్ ఇప్పుడు 5 అంగుళాల పూర్తి క‌లర్డ్‌ TFT డిస్‌ప్లేను క‌లిగి ఉంది. అయితే S మరియు ST మోడల్‌లో 7-అంగుళాల పెద్ద యూనిట్‌ను ఏర్పాటు చేశారు. S మోడల్‌ డిస్‌ప్లేతో ఇంటర్‌ఫేస్ చేయడానికి 5-జాయ్‌స్టిక్‌ను క‌లిగి ఉంటుంది. అయితే ST మోడల్‌లో టచ్ ఫంక్షనాలిటీ కూడా ఉంటుంది. జాయ్‌స్టిక్, టచ్‌స్క్రీన్‌తో పాటు, వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌ను స్కూటర్‌తో క‌నెక్ట్ చేసినట్లయితే, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ నుండి కాల్‌లను స్వీక‌రించ‌వ‌చ్చు. లేదా రిజెక్ట్ చేయ‌వ‌చ్చు. S మరియు ST వేరియంట్‌లు Incognito Mode, స్క్రీన్‌పైనే మ్యూజిక్ కంట్రోల్ వంటి ఫీచ‌ర్లు ఉంటాయి.

మూడు మోడల్‌లు OTA అప్‌డేట్‌లను అందుకుంటాయి. అయితే స్టాండర్డ్ అలాగే S మోడల్‌లు టెలిమాటిక్స్ సిస్టమ్‌కి మాత్రమే అప్‌డేట్‌లను పొందగలవు. కానీ ST మోడల్ క్లస్టర్, బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌కి కూడా అప్‌డేట్‌లను అందుకోగ‌లుగుతుంది. S మోడల్‌ని ఎంచుకోవడం వలన ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌లో డాక్యుమెంట్‌ల డిజిటల్ కాపీలను స్టోర్ చేయడానికి మరియు క్లస్టర్‌పై కాలర్ ఇమేజ్‌ని చూపించడానికి మీకు ఆప్ష‌న్ లభిస్తుంది. ఇక సీటు కింద 32-లీటర్ స్టోరేజ్ స్పేస్ ఉంటుంది. TPMS, కీలెస్ ఆపరేషన్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఇతర ఫీచ‌ర్లు ST మోడల్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి.

READ MORE  Simple OneS | ఓలాకు పోటీగా కొత్తగా సింపుల్ వన్ ఎస్..

మోటార్ & బ్యాటరీ ఫీచ‌ర్లు

TVS ఇప్పటికీ iQubeని హబ్-మౌంటెడ్ BLDC మోటార్‌తో 5.9bhp గరిష్ట పవర్ అవుట్‌పుట్‌తో విక్రయిస్తోంది.
ఇక ST మోడల్ ఇప్పుడు 82kmph గరిష్ట వేగంతో దూసుకుపోతుంది. మిగిలిన రెండు మోడల్‌లు 78kmph వేగంతో వెళ్తాయి. టార్క్ అవుట్‌పుట్ కూడా ఒకే విధంగా ఉంటుంది. లిథియం-అయాన్ బ్యాటరీ విష‌యానికొస్తే ST మోడల్ లో 4.56kWh యూనిట్‌ని కలిగి ఉంది. అది 950W లేదా 1.5kW ఛార్జర్‌ని ఉపయోగించి తక్కువ సమయంలోనే ఫుల్‌ ఛార్జ్ చేయవచ్చు.

TVS-IQube-IQube-S-IQube-ST-E-Scooter

                       iQube                      iQube S                     iQube ST
మోటార్        BLDC
పీక్ పవర్      5.9bhp                     5.9bhp                        5.9bhp
పవర్              4bhp                        4bhp                            4bhp
టార్క్             140Nm                    140Nm                        140Nm

ఛార్జింగ్ సమయం

(0-80 శాతం) 4.30 గంటలు (650W)
2.50 గంటలు (950W) 4.30 గంటలు (650W)
2.50 గంటలు (950W) 4.6 గంటలు (950W)
2.50 గంటలు (1.5kW)

రేంజ్

iQube ఎకానమీ – 100 కిమీ –  పవర్ – 75 కిమీ
S    ఎకానమీ – 110 కిమీ –  పవర్ – 100 కిమీ
ST   ఎకానమీ – 145 కి.మీ – పవర్ – 110 కిమీ

2022 TVS iQube వేరియంట్ స్పెసిఫికేషన్లు

మూడు వేరియంట్‌లు రెండు రైడింగ్ మోడ్‌లతో వస్తాయి – ఎకానమీ & పవర్. స్టాండ‌ర్ట్ iQube, S మోడల్ రెండూ ఎకానమీ మోడ్‌లో 100km, పవర్ మోడ్‌లో 75km పరిధిని అందిస్తాయి. ST మోడల్ పవర్ మోడ్‌లో 110కిమీ, ఎకానమీ మోడ్‌లో 145కిమీల పరిధిని అందిస్తుంది.

ధర

టీవీఎస్ ఐక్యూబ్ ధరలో తేడా గ‌మ‌నించ‌వ‌చ్చు. 2022 TVS iQube బేస్ మోడల్ ధర రూ. 95,564.
S మోడల్ ధర రూ. 1.09 లక్షలు (ఆన్-రోడ్, ఢిల్లీ).
ST మోడల్ ధరలను ఇంకా వెల్లడించలేదు.. అయితే దీని ధ‌ర 1.4-1.5 లక్షల వ‌ర‌కు ఉండొచ్చ‌ని అంచ‌నా..

4 Replies to “2022 TVS iQube మూడు వేరియంట్లు.. తేడాలు గ‌మ‌నించారా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *