Bajaj Chetak C25 Price | ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో, తన ‘చేతక్’ ఎలక్ట్రిక్ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేస్తూ చేతక్ C25 మోడల్‌ను షోరూమ్‌లలో అందుబాటులోకి తెచ్చింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివసించే వారిని దృష్టిలో ఉంచుకుని, తక్కువ ధరలో ప్రీమియం అనుభూతిని అందించేలా ఈ స్కూటర్‌ను రూపొందించారు.
ధర, ఆఫర్ వివరాలు
బజాజ్ చేతక్ C25 అసలు ధర రూ. 91,399 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ). అయితే, మొదటి 10,000 మంది కస్టమర్లకు పరిమిత కాలం వరకు కంపెనీ ప్రత్యేక తగ్గింపును అందిస్తోంది. దీనివల్ల కస్టమర్లు కేవలం రూ. 87,100 ఎఫెక్టివ్ ధరకే ఈ స్కూటర్‌ను సొంతం చేసుకోవచ్చు.
ముఖ్యమైన ఫీచర్లు
- మెటల్ బాడీ: ఇతర బ్రాండ్లు ప్లాస్టిక్ (ABS) బాడీని వాడుతుంటే, బజాజ్ తన సిగ్నేచర్ స్టైల్‌లో ధృడమైన మెటల్ బాడీని అందించింది.
- భద్రత: ఇందులో ఉన్న హిల్-హోల్డ్ అసిస్ట్ ఫీచర్ వల్ల ఎత్తుపల్లాలు లేదా ఫ్లైఓవర్లపై వాహనం వెనక్కి జారకుండా సులభంగా డ్రైవ్ చేయవచ్చు.
- లైటింగ్: ‘గైడ్-మీ-హోమ్’ లైటింగ్ ఫీచర్ రాత్రి సమయాల్లో పార్కింగ్ చేసిన తర్వాత కూడా కొద్దిసేపు వెలుగునిస్తూ సురక్షితంగా వెళ్లేలా చేస్తుంది.
| Bajaj Chetak C2501: Early bird offer | |
|---|---|
| Price (ex-showroom) | ₹91,399 |
| Early bird discount | ₹4,299 |
| Reduced price (ex-showroom) | ₹87,100 |
| Offer applicable for | First 10,000 customers |





