Baja chetak

మ‌రో 6 న‌గ‌రాల‌కు Bajaj Chetak electric scooter

Spread the love

రూ.2వేల‌తో బుకింగ్

Baja chetak

 

బజాజ్ ఆటో కంపెనీ తన Bajaj Chetak electric scooter కోసం దేశంలోని ఆరు నగరాల్లో బుకింగ్‌లను పునఃప్రారంభించింది. అవి పూనే, బెంగళూరు, నాగపూర్, మైసూర్, మంగళూరు ఔరంగాబాద్ న‌గ‌రాల్లో ఇక‌పై బుకింగ్ చేసుకోవ‌చ్చు. స్కూటర్ బుక్ చేయడానికి బ‌జాజ్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్ర‌దించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు మీ కాంటాక్ట్ నంబర్‌ను అందులో పొందుప‌రిచి ఆ త‌ర్వాత మీ ఫోన్‌కు వ‌చ్చే OTP ని నమోదు చేయడం ద్వారా మిమ్మల్ని మీరు ధ్రువీకరించాల్సి ఉంటుంది. పూర్తయిన తర్వాత, మీకు నచ్చిన నగరం, డీలర్, వేరియంట్ అలాగే చేతక్ స్కూట‌ర్ యొక్క రంగును ఎంచుకోవాలి.

ఈ ఆప్ష‌న్ల‌ను ఎంపిక చేసుకున్న తరువాత చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కంప్లీట్ ధర వివ‌రాలు స్క్రీన్‌పై కనిపిస్తుంది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్ మొత్తం రూ.2,000 గా నిర్ణయించారు.

Bajaj Chetak electric scooter

Bajaj Chetak electric scooter స్పెసిఫికేష‌న్ల విష‌యానికొస్తే ఈ స్కూట‌ర్ 3.8 w ఎలక్ట్రిక్ మోటార్‌తో ప‌రిగెడుతుంది. ఇది 5 hp పవర్ మరియు 16.2 Nm టార్క్ జ‌న‌రేట్ చేస్తుంది. ఈ మోటార్ 3 kWh లిథియం-అయాన్ బ్యాటరీకి క‌నెక్ట్ చేయ‌బ‌డి ఉంటుంది.

ఇక ఒక ఫుల్ ఛార్జ్‌లో చేతక్ స్కూట‌ర్ సుమారు 95 కిమీ (ఎకో మోడ్‌లో) వరకు ప్ర‌యాణించ‌గ‌ల‌దు.

టాప్ స్పీడ్ 70కి.మి

Bajaj Chetak  గరిష్టంగా గంటకు 70 కి.మీ. వేగంతో దూసుకెళ్తుంది. బజాజ్ ఆటో ప్రస్తుతం వచ్చే ఏడాది నాటికి భారతదేశంలోని 20కి పైగా నగరాల్లో చేతక్ అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇటీవల భారతదేశంలో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ సెగ్మెంట్‌లో ఓలా ఎస్ 1, ఓలా ఎస్ 1ప్రోఓలా ఎస్ 1ప్రో అలాగే సింపుల్ వన్ అనే కొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు చేతక్‌కు గట్టి పోటీ ఇవ్వ‌నున్నాయి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లో స‌ర‌స‌మైన ధరలోనే అత్యాధునిక ఫీచ‌ర్లు అందించారు. ఇక సింపుల్ వన్ స్కూట‌ర్ అన్నింటికంటే 200+ కిమీ రేంజ్ కలిగి ఉండ‌డం దీని ప్ర‌త్యేక‌త‌. ఇక మ‌రో హైస్పీడ్ ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ ఏథ‌ర్ 450xఏథ‌ర్ 450x కూడా బ‌జాజ్ చేత‌క్‌కు గ‌ట్టి పోటీ ఇవ్వ‌నుంది.

More From Author

ti mantra electric cycle

అందుబాటు ధ‌ర‌లో Montra Electric Cycle

LML Scooter

LML Scooter రీ ఎంట్రీ..

4 thoughts on “మ‌రో 6 న‌గ‌రాల‌కు Bajaj Chetak electric scooter

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *